అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Peddapalli Nizamabad Section | పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్ (Secunderabad Railway Division) నుంచి హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి బదిలీ చేశారు. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం పెద్దపల్లి నుంచి నిజామాబాద్ సెక్షన్‌లోని రైల్వే స్టేషన్లు నిజామాబాద్ జంక్షన్ మినహాయించి సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నాయి. తాజా మార్పుతో పెద్దపల్లి జంక్షన్, పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ మినహా మిగిలిన రైల్వే స్టేషన్లన్నీ హైదరాబాద్ డివిజన్ పరిధిలోకి రానున్నాయి.
Peddapalli Nizamabad Section | 10న ప్రధాని పర్యటన
దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ గోపాల కృష్ణన్ నేడు సాయంత్రం పెద్దపల్లి జంక్షన్‌ను తనిఖీ చేయనున్నారు. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే సెక్షన్ హైదరాబాద్ డివిజన్‌లోకి బదిలీ చేయడం, అలాగే ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 10న హైదరాబాద్‌లో పలు రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రైల్వే మేనేజర్ పెద్దపల్లి రైల్వే జంక్షన్న్ను పరిశీలించనున్నారు. అలాగే పెద్దపల్లి నుంచి నిజామాబాద్ సెక్షన్ పరిధిలోని నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి రైల్వే స్టేషన్‌ను డీఆర్ఎం తనిఖీ చేయనున్నారు. ఈ స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Peddapalli Nizamabad Section | కొత్త జోన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరుతో విశాఖపట్నం జోనల్ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంటూరు డివిజన్‌కి చెందిన మిర్యాలగూడ, నల్గొండ లాంటి స్టేషన్లు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ కానున్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని రాయ్‌చూర్ జంక్షన్, కృష్ణా రైల్వే స్టేషన్లు గుంతకల్లు రైల్వే డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి బదిలీ కానున్నాయి.
ప్రస్తుతం వికారాబాద్ నుంచి పర్లీ వైద్యనాథ్ వరకు గల మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్ నుండి నాందేడ్ డివిజన్‌లోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి కొత్తగా ఆవిర్భవించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తున్నాయి.
ఇది కూడా చదవండి : Sadashivpet ACB Trap | ఔట్సోర్సింగ్ ఉద్యోగి లంచావతారం.. ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్!

