తెలంగాణPeddapalli Nizamabad Section | పెద్దపల్లి–నిజామాబాద్​ రైల్వే సెక్షన్​ మార్పు.. నేడు నిజామాబాద్​ జిల్లాకు...

Peddapalli Nizamabad Section | పెద్దపల్లి–నిజామాబాద్​ రైల్వే సెక్షన్​ మార్పు.. నేడు నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​ఎం

పెద్దపల్లి నుంచి నిజామాబాద్​ రైల్వే సెక్షన్​ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి హైదరాబాద్​ డివిజన్ పరిధిలోకి బదిలీ చేశారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Peddapalli Nizamabad Section | పెద్దపల్లి నుంచి నిజామాబాద్​ రైల్వే సెక్షన్​ను సికింద్రాబాద్ డివిజన్ (Secunderabad Railway Division) నుంచి హైదరాబాద్​ డివిజన్ పరిధిలోకి బదిలీ చేశారు. ఈ మేరకు రైల్వే శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం పెద్దపల్లి నుంచి నిజామాబాద్​ సెక్షన్​లోని రైల్వే స్టేషన్లు నిజామాబాద్​ జంక్షన్ మినహాయించి సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్నాయి. తాజా మార్పుతో పెద్దపల్లి జంక్షన్, పెద్దపల్లి బైపాస్ క్యాబిన్ మినహా మిగిలిన రైల్వే స్టేషన్లన్నీ హైదరాబాద్​ డివిజన్ పరిధిలోకి రానున్నాయి.

Peddapalli Nizamabad Section | 10న ప్రధాని పర్యటన

దక్షిణ మధ్య రైల్వే జోన్ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆర్ గోపాల కృష్ణన్ నేడు సాయంత్రం పెద్దపల్లి జంక్షన్​ను తనిఖీ చేయనున్నారు. పెద్దపల్లి నుంచి నిజామాబాద్ రైల్వే సెక్షన్ హైదరాబాద్​ డివిజన్​లోకి బదిలీ చేయడం, అలాగే ప్రధాని మోదీ (PM Modi) ఈ నెల 10న హైదరాబాద్​లో పలు రైల్వే స్టేషన్లు ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రైల్వే మేనేజర్​ పెద్దపల్లి రైల్వే జంక్షన్​న్​ను పరిశీలించనున్నారు. అలాగే పెద్దపల్లి నుంచి నిజామాబాద్​ సెక్షన్ పరిధిలోని నిజామాబాద్​ జిల్లా మామిడిపల్లి రైల్వే స్టేషన్​ను డీఆర్ఎం తనిఖీ చేయనున్నారు. ఈ స్టేషన్​ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

Peddapalli Nizamabad Section | కొత్త జోన్​ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక దక్షిణ కోస్తా రైల్వే జోన్ పేరుతో విశాఖపట్నం జోనల్ కేంద్రంగా ఆవిర్భవిస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని గుంటూరు డివిజన్​కి చెందిన మిర్యాలగూడ, నల్గొండ లాంటి స్టేషన్లు సికింద్రాబాద్ డివిజన్​కు బదిలీ కానున్నాయి. అలాగే కర్ణాటక రాష్ట్రంలోని రాయ్​చూర్ జంక్షన్, కృష్ణా రైల్వే స్టేషన్లు గుంతకల్లు రైల్వే డివిజన్ నుంచి సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి బదిలీ కానున్నాయి.

ప్రస్తుతం వికారాబాద్ నుంచి పర్లీ వైద్యనాథ్ వరకు గల మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్ నుండి నాందేడ్ డివిజన్​లోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి కొత్తగా ఆవిర్భవించే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వెళ్తున్నాయి.

ఇది కూడా చదవండి : Sadashivpet ACB Trap | ఔట్​సోర్సింగ్​ ఉద్యోగి లంచావతారం.. ఏసీబీకి చిక్కిన బిల్​ కలెక్టర్​!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​లో నయా స్కామ్​.. వాహనదారుల ఆందోళన

అక్షరటుడే, వెబ్​డెస్క్: Petrol Bunk Scam | పెట్రోల్​ బంక్​ల్లో కొత్త...

Hyderabad Fire Accident | హైదరాబాద్​లో మరో అగ్నిప్రమాదం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Fire Accident | హైదరాబాద్ (Hyderabad)​లో వరుస అగ్ని...

Goa Hockey Accident | గోవాలో విషాద ఘటన.. హాకీ బంతి తలకు తగిలి 13 ఏళ్ల బాలిక మృతి..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Goa Hockey Accident | గోవా (Goa)లోని...