MP Dharmapuri Arvind | ఢిల్లీలో బిజీబిజీగా ఎంపీ అర్వింద్​.. ఎఫీసీఆర్​ఏ, వాణిజ్య కమిటీ సమావేశాలకు హాజరు

న్యూఢిల్లీలో ఎంపీ ధర్మపురి అర్వింద్​ బిజీబిజీగా ఉన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నెట్​వర్క్​: MP Dharmapuri Arvind | న్యూఢిల్లీలో (New Delh) ఎంపీ ధర్మపురి అర్వింద్​ బిజీబిజీగా ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం( FCRA Amendment Bill), వాణిజ్య కమిటీ  సమావేశాల్లో పాల్గొన్నారు.

MP Dharmapuri Arvind | ఎఫ్​సీఆర్​ఏ సంయుక్త పార్లమెంటరీ కమిటీ..

న్యూఢిల్లీలో అక్టోబర్ 12,13 తేదీల్లో జరిగిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో ఎంపీ అర్వింద్​ పాల్గొన్నారు. ఎఫ్​సీఆర్​ఏ సవరణ బిల్లును సమగ్రంగా పరిశీలించేందుకు ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమావేశాల్లో విదేశీ విరాళాల నియంత్రణ, వాటి వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం, చట్టపరమైన నిబంధనల అమలు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో వివిధ మత, సామాజిక, సేవా సంస్థల ప్రతినిధులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, న్యాయ నిపుణులు, విద్యాసంస్థల ప్రతినిధుల నుంచి బిల్లుపై అభిప్రాయాలు, సూచనలను కమిటీ స్వీకరించింది. విదేశాల నుంచి అందే నిధులు చట్టబద్ధమైన మార్గాల్లో వినియోగించబడేలా చూడటం, నిధుల వినియోగంలో పారదర్శకతను పెంపొందించడం, సంబంధిత సంస్థల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

MP Dharmapuri Arvind | వాణిజ్య కమిటీ సమావేశంలో..

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన వాణిజ్య కమిటీ సమావేశంలోనూ ఎంపీ అర్వింద్ ధర్మపురి పాల్గొన్నారు. దేశ వాణిజ్య రంగ అభివృద్ధి, పారిశ్రామిక పురోగతి, ఎగుమతుల ప్రోత్సాహం, దేశీయ పరిశ్రమలకు అవకాశాల కల్పన, వాణిజ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు వంటి అంశాలపై పార్లమెంటరీ కమిటీల ద్వారా జరిగే పరిశీలనలు, చర్చల్లో ఆయన పాలు పంచుకున్నారు. పార్లమెంటరీ కమిటీల సభ్యుడిగా వివిధ రంగాలకు సంబంధించిన విధానపరమైన అంశాల పరిశీలనలో భాగస్వామ్యం కావడం ద్వారా ఎంపీ అర్వింద్ దేశ అభివృద్ధికి సంబంధించిన చర్చల్లో తన వంతు పాత్ర పోషించారు.

ఇది కూడా చదవండి: జాతీయ జెండా పట్టినందుకు అరెస్టా? అమిత్ షాకు CJP సవాల్..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *