Oct 15 Market Analysis | ఇన్ఫ్లెషన్ భయాలు..ఎరుపెక్కిన ఆసియా మార్కెట్లు

ప్రధాన ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి. మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ డౌన్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 15 Market Analysis | అమెరికా (America) వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం అంచనాలకన్నా అధికంగా వచ్చింది. దీంతో ఈ ఏడాది చివర్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచవచ్చని మార్కెట్ ఆందోళన చెందుతోంది.

దీంతో గత సెషన్ లో వాల్ స్ట్రీట్(Wallstreet) పడిపోయింది. పశ్చిమాసియాలో జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగుతుండడం, ముడి చమురు సరఫరా అంతరాయాల భయాలు పెరగడంతో గురువారం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎరుపెక్కాయి.

Oct 15 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 1.88 శాతం, ఎస్ అండ్ పీ 1.11 శాతం నష్టపోగా.. గురువారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం నష్టంతో ఉంది.

Oct 15 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.15 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.58 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.69 శాతం పెరిగాయి.

Oct 15 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు లాభాలతో ఉన్నాయి. ఉదయం 8.10 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 7.62 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 4.80 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 2.78 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.73 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.09 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.08 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.02 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

CJP Leaders | సీజేపీ నాయకులకు 5 రోజుల జైలు శిక్ష

గమనించాల్సిన అంశాలు..

  • విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా 14వ సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. నికరంగా రూ. 1,857 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా 45 వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 2,670 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు బలపడి 95.15 వద్ద ఉంది.
  • క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 104.35 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 102.06 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5.11 శాతం వద్ద ఉంది.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.16 నుంచి 0.91 కు తగ్గింది.
  • విక్స్ 3.58 శాతం పెరిగి 14.62 వద్ద ఉంది.
  • సెన్సెక్స్ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.
Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *