అక్షరటుడే, వెబ్డెస్క్: Kamchatka Earthquake | రష్యా (Russia)లోని కమ్చట్కా ద్వీపకల్పంలో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూమికి 140 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు పేర్కొంది.
భూకంపం సంభవించిన వెంటనే ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. ప్రకంపనల తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని యూఎస్ నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ తెలిపింది. జపాన్ వాతావరణ సంస్థ 9.9 తీవ్రత గల భూకంపం వస్తుందని అంచనా వేస్తూ, దేశంలోని చాలా ప్రాంతాలలో బలమైన ప్రకంపనలు సంభవిస్తాయని ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. అక్కడ 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది.
Kamchatka Earthquake | తరచూ భూకంపాలు
కామ్చట్కా ద్వీపకల్పం ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలువబడే ఒక టెక్టోనిక్ బెల్ట్పై ఉంది. ఇది పసిఫిక్ మహాసముద్రంలో చాలా భాగాన్ని చుట్టుముట్టి ఉంటుంది. దీంతో ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయి. గత సంవత్సరం జూలైలో ఈ ప్రాంతంలో 8.8 తీవ్రత గల భారీ భూకంపం రావడంతో సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. సముద్రల అలల తాకిడికి ఓ గ్రామం కొట్టుకుపోయింది.
ఇది కూడా చదవండి..: tesla roadster | భూమిపైనే కాదు.. గాల్లోనూ రాకెట్ వేగం! గాల్లోకి ఎగిరి జంప్ చేసిన ‘టెస్లా రోడ్స్టర్’!