అక్షరటుడే, వెబ్డెస్క్: Suryapet Road Accident | సూర్యాపేట జిల్లా (Suryapet District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జాగింగ్ కోసం వెళ్లిన ముగ్గురిపైకి బొలెరో వాహనం దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
సూర్యాపేట మండలం బాలెంల స్టేజి వద్ద గుర్రం సైదులు, నాగరాజు, గొల్ల జానయ్య శుక్రవారం ఉదయం జాగింగ్కు వెళ్లారు. జనగాం నుంచి సూర్యాపేట వైపు వస్తున్న ఓ బొలెరో వాహనం వారిని వేగంగా ఢీకొంది. ప్రమాదంలో గుర్రం సైదులు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన నాగరాజు, జానయ్యలను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ నాగరాజు సైతం మరణించాడు. జానయ్య సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Suryapet Road Accident | డ్రైవర్ అరెస్ట్..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం అనంతరం బొలెరో డ్రైవర్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. స్థానిక పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అతడిని మిర్యాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతితో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఇది కూడా చదవండి..: Telangana Inter Exam Fee | ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. మార్చి 2027 పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల!