Oct 17 Horoscope | తులారాశిలో సూర్య సంచారం.. బుధాదిత్య యోగంతో ఈ రాశుల వారికి ధనయోగం!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 17 Horoscope | జ్యోతిష్యపరంగా ముఖ్యమైన గ్రహ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తుండటంతో పాటు ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తుండగా, బుధాదిత్య, త్రిగ్రాహి వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి.

ఈ ప్రత్యేక గ్రహాల గమనం కారణంగా మేషం నుంచి మీన రాశి వరకు వివిధ రాశుల వారి జీవితాల్లో నేడు (శనివారం, అక్టోబరు 17) కీలక మార్పులు రానున్నాయి. కొన్ని రాశుల వారికి ఊహించని ధనలాభాలు, కెరీర్‌లో అద్భుతమైన అవకాశాలు లభిస్తే, మరికొందరికి చిన్నపాటి ఒడుదుడుకులు ఎదురయ్యే సూచనలున్నాయి.

Oct 17 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Oct 17 Horoscope | ఈ రాశి నుంచి చంద్రుడు తొమ్మిదో స్థానంలో, సూర్యుడు సప్తమ స్థానంలో సంచరిస్తారు. చేపట్టిన పనులన్నింటిలోనూ మెరుగైన ఫలితాలు అందుకుంటారు. సాయంత్రంలోపు ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే కొత్త ప్రాజెక్టుల ప్రారంభాన్ని మాత్రం కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

వృషభ రాశి: Oct 17 Horoscope | చంద్రుడు అష్టమ స్థానంలో, సూర్యుడు ఆరో స్థానంలో (తులారాశిలోకి) సంచరించనున్నారు. మీ పనితీరు మెరుగ్గా ఉండి, శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే ప్రత్యర్థుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

ఇది కూడా చదవండి: pm modi | అరాచక రాజకీయాలపై నిప్పులు చెరిగిన ప్రధాని.. ప్రత్యర్థులపై మోడీ పూర్తిగా అటాక్​ మోడ్​!

మిథున రాశి: Oct 17 Horoscope | ఇవాళ మీకు ఎంతో సంతోషకరంగా గడుస్తుంది. చంద్రుడు సప్తమ స్థానంలో, సూర్యుడు పంచమ స్థానంలో ఉండి అనుకూల ఫలితాలను ఇస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారులు మంచి లావాదేవీలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దానధర్మాలు చేసే అవకాశం ఉంది. పరిహారం: ఇవాళ దుర్గా చాలీసా పఠించాలి.

కర్కాటక రాశి: Oct 17 Horoscope | ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చంద్రుడు ఆరో స్థానంలో, సూర్యుడు నాలుగో స్థానంలో సంచరిస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధించే అవకాశాలున్నప్పటికీ, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండదు కాబట్టి, కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం.

సింహ రాశి: Oct 17 Horoscope | చంద్రుడు పంచమ స్థానంలో సంచరించనుండగా, రాశ్యధిపతి సూర్యుడు రెండు, మూడు స్థానాల నుంచి సంచారం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

వ్యాపారులకు మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ఆస్తి లావాదేవీలు, పాత పెట్టుబడుల ద్వారా విశేష ప్రయోజనాలు పొందుతారు. తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉండి, బంధువుల నుంచి కూడా అనుకూలత లభిస్తుంది.

కన్యా రాశి: Oct 17 Horoscope | చంద్రుడు నాలుగో స్థానంలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు లభిస్తాయి. సూర్యుడు ఈ రాశి నుంచి వెళ్ళిపోవడం ద్వారా ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. స్నేహితులు, సహోద్యోగుల నుంచి చక్కటి సహకారం అందుతుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలతో పాటు సమాజంలో గౌరవం పెరుగుతుంది.

తులా రాశి: Oct 17 Horoscope | చంద్రుడు మూడో స్థానంలో సంచరిస్తుండగా, సూర్యుడు ఇదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వ్యాపారస్తులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు, ప్రజాదరణ లభిస్తుంది. కోల్పోయిన డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

వృశ్చిక రాశి: చంద్రుడు , సూర్యుడు రెండో స్థానంలో సంచరించనున్నారు. చేపట్టిన పనుల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, ఆదాయంతో పాటు ఖర్చులు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించడానికి మరింత కష్టపడాలి.

ధనుస్సు రాశి: వీరికి ఇవాళ ఎంతో అనుకూలంగా ఉంటుంది. చంద్రుడు పదకొండో స్థానంలో సంచరిస్తూ అన్ని పనుల్లోనూ మంచి విజయాలను అందిస్తాడు. ఉద్యోగులకు సహోద్యోగుల సహాయం లభిస్తుంది. విదేశీ వనరుల ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.

మకర రాశి: ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. చంద్రుడు పన్నెండో స్థానంలో, గురుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరుతుంది.

కుంభ రాశి: చంద్రుడు పదకొండో స్థానంలో, శని రెండో స్థానంలో, సూర్యుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు సహోద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి సాయం అందుతుంది.

మీన రాశి: ఇవాళ మీకు కుటుంబ జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు రావడం ద్వారా ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వైవాహిక జీవితం ఎంతో సుఖసంతోషాలతో సాగుతుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *