Para Asian Games | ఆసియా పారా గేమ్స్​లో భారత్​ రికార్డులు

ఆసియా పారా గేమ్స్​లో భారత క్రీడాకారులు ప్రపంచ రికార్డులు నెలకొల్పారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Para Asian Games | జపాన్​లో జరుగుతున్న పారా ఆసియా గేమ్స్​ (Para Asian Games)లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. శుక్రవారం ఏకంగా మూడు ప్రపంచ రికార్డులను నమోదు చేశారు.

పురుషుల 400 మీటర్ల పరుగులో భారత క్రీడాకారులు సందీప్ కుమార్ స్వర్ణ పతకాన్ని, అజయ్ కుమార్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. సందీప్ 52.28 సెకన్లలోనే గమ్యాన్ని చేరుకొని ప్రపంచ రికార్డును నెలకొల్పారు. జావెలిన్ త్రోలో హేనీ 60.49 మీటర్ల భారీ దూరం విసిరి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పి స్వర్ణం సాధించాడు. అంతకుముందు డిస్కస్ త్రోలో అతడు కాంస్యం గెలుచుకున్నాడు.

Para Asian Games | బ్యాడ్మింటన్​లో..

బ్యాడ్మింటన్ ఫైనల్‌లో భారత క్రీడాకారులు నితేష్ కుమార్, ప్రమోద్ భగత్‌ తలపడ్డారు. నితేష్, ప్రమోద్‌ను 21-18, 21-16 తేడాతో ఓడించి, వరుస సెట్లలో విజయం సాధించాడు. దీంతో అతడు బంగారు పతకం. ప్రమోద్​ సిల్వర్​ మెడల్​ సాధించారు. SL4 బ్యాడ్మింటన్ ఈవెంట్‌లో నవీన్ శివకుమార్ స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఆర్చరీ పురుషుల రికర్వ్ టీమ్ హర్విందర్ సింగ్, విజయ్ సుండి చైనాపై 5-1 తేడాతో విజయం సాధించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి..: Asian Para Games | ఆసియా పారా గేమ్స్​.. ఆర్చరీలో భారత్​కు గోల్డ్​ మెడల్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *