Saudi Missile Interception | మక్కా, మదీనాపై క్షిపణి దాడులను అడ్డుకున్నాం : సౌదీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Saudi Missile Interception | యెమెన్‌కు చెందిన హౌతీలు మక్కా, మదీనాలపై ప్రయోగించిన క్షిపణులను అడ్డుకున్నామని సౌదీ అరేబియా తెలిపింది. మక్కా అల్-ముకరమ్మా, మదీనా అల్-మునవ్వరా ప్రాంతాల వైపు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణుల శకలాలు పడ్డాయి పౌర రక్షణ జనరల్ డైరెక్టరేట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇస్లాంలో రెండు అత్యంత పవిత్ర నగరాలను లక్ష్యంగా చేసుకున్నామన్న ఆరోపణలను హౌతీలు ఖండించారు. తాము పవిత్ర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయని సౌదీ చేస్తున్న ప్రచారం అబద్ధమని హౌతీ సైనిక ప్రతినిధి యాహ్యా సరీ అన్నారు. శుక్రవారం, శనివారం రోజులలో మూడు విమానాశ్రయాలు, రెండు చమురు కేంద్రాలు, ఒక పైప్‌లైన్, ఒక వైమానిక స్థావరంతో సహా పలు సౌదీ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు చెప్పారు.

 Saudi Missile Interception | ఓడరేవుపై..

దక్షిణ ఏడెన్ ఓడరేవులోని తీరరక్షక దళాల సౌకర్యాలపై హౌతీలు మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని సౌదీ మద్దతుగల యెమెన్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడులతో సౌదీలో ఆందోళన నెలకొంది. కాగా యెమెన్​ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఉండగా.. హౌతీలకు ఇరాన్​ మద్దతు ఇస్తోంది. హౌతీలు యెమెన్​ రాజధాని సనాపై నియంత్రణ కలిగి ఉన్నారు.

దీనిని కూడా చదవండి : Namapur IKP Paddy Centre | రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ లక్ష్యం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *