Hyderabad Loud Sounds | హైదరాబాద్‌లో భారీ శబ్దాలు

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ శబ్దాలు వినిపించాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hyderabad Loud Sounds | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ శబ్దాలు వినిపించాయి. బ్లాస్టింగ్​ను తలపించేలా కొన్ని కిలోమీటర్ల పరిధిలో సౌండ్లు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

నగరంలోని ఉప్పరపల్లి, ఎర్రగడ్డ, లంగర్ హౌస్, కేశవస్వామి నగర్‌లో ఉదయం 9.15 గంటల సమయంలో భారీ శబ్దాలు వచ్చాయి. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో భారీ శబ్దాలు స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వచ్చిందేమోనని భయపడ్డారు. రాజేంద్రనగర్‌లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

Hyderabad Loud Sounds | ఆరా తీస్తున్న పోలీసులు

భారీ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదు. భూకంపం వచ్చిందా.. లేక ఎవరైనా బ్లాస్టింగ్ చేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే భూకంపం వస్తే అంత పెద్ద స్థాయిలో శబ్దం వచ్చే అవకాశం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలను సందర్శించారు. ఈ శబ్దాల వెనుక కారణాలపై ఆరా తీస్తున్నారు. క్లూస్ టీమ్​ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Earphone Train Accident | ఇయర్​ ఫోన్లు పెట్టుకొని వెళ్తుండగా.. ఢీకొన్న రైలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *