అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | క్రూడ్ ఆయిల్ ధర కొంతకాలంగా గరిష్టాల వద్ద కొనసాగుతుండడం, యూఎస్ పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.97 శాతంపైనే కదలాడుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్న మదుపరులు.. కనిష్టాల వద్ద కొనుగోళ్లతో మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగుతున్నాయి.
Indian Stock Market | ఆటోలో కొనుగోళ్లు.. ఐటీలో అమ్మకాలు..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో మంగళవారం ఆటో షేర్లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. బజాజ్ ఆటో, మారుతి సుజుకీ ఇండియా వంటి ఆటో షేర్ల క్యూ2 ఫలితాలకు ముందు జరిగిన కొనుగోళ్లు మార్కెట్లలో నష్టాలను పరిమితం చేశాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1.50 శాతం లాభంతో ట్రేడవుతోంది. మరోవైపు ఏఐ ఆధారిత విప్లవం, ప్రపంచ అనిశ్చితి కారణంగా ఐటీ సెక్టార్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఒక దశలో 2 శాతానికిపైగా పడిపోయినా.. తర్వాత కోలుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక శాతం నష్టంతో ఉంది.
Indian Stock Market | నష్టాలతో ప్రారంభమై..
దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 122 పాయింట్ల గ్యాప్ డౌన్‌లో ప్రారంభమై మరో 274 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మరో 55 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్లు కనిష్టాల వద్ద వాల్యూ బయ్యింగ్‌కు దిగడంతో ప్రధాన సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 476 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్లు పెరిగాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 73,589 వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 22,770 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 15 స్టాక్స్ లాభాలతో, 15 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. బీఈఎల్ 2.37 శాతం, పవర్‌గ్రిడ్ 2.33 శాతం, ఎయిర్‌టెల్ 2.13 శాతం, ట్రెంట్ 2.04 శాతం, మారుతి 1.61 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : హెచ్యూఎల్ 2.16 శాతం, టీసీఎల్ 1.76 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.14 శాతం, ఆసియన్ పెయింట్ 0.94 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.93 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: Malabar Gold Fraud | బంగారం ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా.. మలబార్ గోల్డ్ షోరూమ్‌లో స్కాం తెలిస్తే షాకే..