అక్షరటుడే, వెబ్‌డెస్క్: Congress Rally Delhi | కాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీపై ఢిల్లీలోని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ 1న దేశ రాజధానిలో ఇండియా బ్లాక్ ప్రతిపాదిత నిరసన ర్యాలీని దీపావళి తర్వాతకు వాయిదా వేయాలని వారు కోరుతున్నారు.
రామ్‌లీలా మైదాన్‌లో 10 లక్షల మందితో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. పండుగ సమయంలో నిరసన కార్యక్రమాలతో తమ వ్యాపారం దెబ్బతింటుందని దుకాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. కాగా గతంలో ఆయన లేఖ రాయగా.. రాహుల్ గాంధీ (Rahul Gandhi) తిరస్కరించారు. దీంతో రామ్‌లీలా మైదాన్ చుట్టుపక్కల ఉన్న 20 ప్రధాన మార్కెట్లలోని వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈక్రమంలో గోయల్ మరోసారి లోక్‌సభ ప్రతిపక్ష నేతకు లేఖ రాశారు.
Congress Rally Delhi | అలా చేస్తేనే..
వ్యాపారులు తమ వ్యాపారం గురించి ర్యాలీని వాయిదా వేసుకోవాలని కోరగా.. రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా స్పందించారు. వ్యాపారులకు ఊరట ఇవ్వకుండా.. ఆయన జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. మోదీ సీఈసీని తొలగిస్తే వెంటనే నిరసన ఆపేస్తామన్నారు. భారీ ర్యాలీ కారణంగా రాజధానిలో విధించే ఆంక్షలు వ్యాపార సీజన్‌కు ఆటంకం కలిగించవచ్చని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. రామ్‌లీలా మైదాన్ చుట్టూ ఢిల్లీలోని అతిపెద్ద హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. ఒకవేళ ఈ ర్యాలీని వాయిదా వేయడం సాధ్యం కాకపోతే, దానిని రామ్‌లీలా మైదాన్ నుండి బురారీ గ్రౌండ్స్ లేదా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వంటి ఇతర ప్రాంతాలకు మార్చాలని సీటీఐ కోరింది. అయితే ప్రతిపక్ష నేత వ్యాపారుల ఆందోళనలను లెక్కచేస్తారా లేదా చూడాలి.
ఇది కూడా చదవండి..: Tamil Nadu Prison Break | ఖైదీల పరారీ.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు