Assam Drug Destruction | రూ.472 కోట్ల డ్రగ్స్​ ధ్వంసం..

అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Assam Drug Destruction | అసోం రాష్ట్రంలో మాదకద్రవ్యాల ముప్పును రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. నల్బారీ జిల్లాలోని 14వ బెటాలియన్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో, రూ. 472 కోట్ల విలువైన డ్రగ్స్‌ను ప్రభుత్వం బహిరంగంగా ధ్వంసం చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా పాల్గొన్నారు.

Assam Drug Destruction | రోడ్ రోలర్‌తో..

పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వివిధ దాడుల్లో స్వాధీనం చేసుకున్న భారీ డ్రగ్స్ నిల్వలను అధికారుల సమక్షంలో నాశనం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా రోడ్ రోలర్‌ను నడిపి, డ్రగ్స్ ప్యాకెట్లను తొక్కి వాటిని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ చర్యల్లో భాగంగా డ్రగ్స్ మాఫియా పట్ల ఎంత కఠినంగా ఉంటామో ఈ కార్యక్రమం ద్వారా ఆయన స్పష్టం చేశారు.

Assam Drug Destruction | డ్రగ్స్ రహిత అసోం లక్ష్యం

ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. “అసోంను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. డ్రగ్స్ రవాణా చేసే ముఠాల పట్ల ఉపేక్షించే ప్రసక్తే లేదు” అని గట్టిగా హెచ్చరించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తాము చేస్తున్న ప్రయత్నాలకు, ఈ వినూత్న కార్యక్రమం ఒక సంకేతమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

దీనిని కూడా చదవండి : Harish Rao Statement | రైతుల కోసం రక్తం ఇవ్వడానికి సిద్ధం : హరీశ్​ రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *