అక్షరటుడే, వెబ్‌డెస్క్: Israel Election Results | ఇజ్రాయెల్‌లో ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఉత్కంఠ పోరులో ప్రస్తుత ప్రధానమంత్రి నెతన్యాహు కూటమి అత్యధిక సీట్లు గెలుచుకుంది. కానీ మెజారిటీకి కావాల్సిన సీట్లు మాత్రం సాధించలేకపోయింది.
Israel Election Results | 53 స్థానాల్లో విజయం
క్నెసెట్లోని 120 స్థానాలకు గాను నెతన్యాహు కూటమి 53 స్థానాలను కైవసం చేసుంది. ఆయన లికుడ్ పార్టీ 27 స్థానాలతో అతిపెద్ద ఏకైక కూటమిగా అవతరించింది. మరోవైపు.. యషార్ పార్టీ ఛైర్మన్ గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి 48 స్థానాల్లో గెలుపొందింది.
Israel Election Results | అరబ్ పార్టీలకు 19 సీట్లు
అరబ్ రాజకీయ కూటములైన రామ్, జాయింట్ లిస్ట్, సంయుక్తంగా 19 స్థానాలను గెలుచుకుని కింగ్‌మేకర్‌గా మారాయి. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక కొత్త క్నెసెట్ నవంబర్ 10న ప్రమాణ స్వీకారం చేస్తుంది.
రాజకీయ చర్చలకు రంగం సిద్ధం..
హంగ్ ఫలితాలతో రాజకీయం ఉత్కంఠగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు అవసరమైన 61 స్థానాలను ఏ ఒక్క కూటమి కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో రాజకీయ చర్చలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం కోసం రెండు కూటములు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక వేళ పార్టీలు ఒక ఒప్పందానికి రాలేకపోతే, ఇజ్రాయెల్ మరో ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇది కూడా చదవండి..: Bhutan glacier outburst | భూటాన్‌లో పెను విధ్వంసం.. ఉప్పొందిన హిమానీనదం.. భారత్‌లో హైఅలర్ట్!