Gold and Silver Prices | భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఎలా ఉన్నాయంటే?

గత కొన్ని రోజులుగా దేశీయ బులియన్​ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి.

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Gold and Silver Prices | గత కొన్ని రోజులుగా దేశీయ బులియన్​ మార్కెట్​లో బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లోని పరిణామాలు, ముడి చమురు ధరల్లో మార్పులు, రూపాయి మారకపు విలువ తదితర అంశాలు ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

Gold and Silver Prices | హైదరాబాద్‌లో ఎంతంటే..

హైదరాబాద్‌ (Hyderabad)లో 24 క్యారెట్ల గోల్డ్​ (10 గ్రాములు) రేటు రూ. 1,45,260గా నమోదైంది. అలాగే ముంబయి, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో కూడా సుమారు ఇవే ధరలు ఉన్నాయి. ఇక 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 1,31,940గా ఉంది. ఇంటర్నేషనల్​ మార్కెట్‌లో ఒక ఔన్సుకు 3,991 డాలర్లుగా ఉంది.

Gold and Silver Prices | వెండి ధరలు కూడా డౌన్​..!

వెండి ధరలు నేడు కూడా తగ్గాయి. నిన్న కిలోకు రూ. 1,97,500గా ఉన్న ధర.. నేడు రూ. 7,500 తగ్గి రూ. 1,90,000కు చేరింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 51 డాలర్లు పలుకుతోంది.

ఇది కూడా చదవండి..: Bhutan glacier outburst | భూటాన్‌లో పెను విధ్వంసం.. ఉప్పొందిన హిమానీనదం.. భారత్‌లో హైఅలర్ట్!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *