అక్షరటుడే, వెబ్‌డెస్క్: Manisha Bhanwala gold medal | భారత మహిళా రెజ్లింగ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. అస్తానా వేదికగా జరుగుతున్న ప్రసిద్ధ ‘వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్’లో భారత BHARAT మహిళా రెజ్లర్ మనీషా భాన్వాలా చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో పసిడి పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా మనీషా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కారు.
Manisha Bhanwala gold medal | వెనుకబడినా అద్భుత రికవరీ!
59 కిలోల విభాగంలో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో మనీషా భాన్వాలా.. అమెరికాకు చెందిన బలమైన ప్రత్యర్థి ఎలిజబెత్ నెట్టెతో తలపడ్డారు. మ్యాచ్ ప్రారంభంలో ప్రత్యర్థి ఆధిపత్యం ప్రదర్శించడంతో మనీషా ఒక దశలో 1-5 పాయింట్ల తేడాతో తీవ్రంగా వెనుకబడ్డారు.
అయితే, ఏమాత్రం పట్టువదలకుండా అద్భుతమైన రికవరీతో పుంజుకున్న మనీషా, తనదైన శైలిలో మెరుపు పట్టులతో మ్యాచ్‌ను పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. చివరికి 8-6 తేడాతో ఎలిజబెత్‌పై చిరస్మరణీయ విజయాన్ని సాధించి స్వర్ణాన్ని ముద్దాడారు.
Manisha Bhanwala gold medal | భారత్‌కు పతకాల పంట!
ఇదే వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. మనీషా భాన్వాలా స్వర్ణంతో మెరిసి చరిత్ర సృష్టించగా.. భారతదేశానికే చెందిన నీలం సిరోహి, కాజల్ ధోచక్ కూడా తమ విభాగాల్లో అత్యుత్తమ పోరాటాన్ని ప్రదర్శించి రజత పతకాలు (Silver Medals) సాధించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
వరల్డ్ ఛాంపియన్షిప్ వేదికగా భారత మహిళా రెజ్లర్లు సాధించిన ఈ చారిత్రక విజయాలపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రీడా ప్రముఖులు, అభిమానులు వీరికి అభినందనలు తెలియజేస్తున్నారు.