అక్షరటుడే, వెబ్‌డెస్క్: INDIA Alliance Rally | ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ (Delhi)లోని రామ్‌లీలా మైదానంలో విపక్ష ఇండియా కూటమి ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ కారణంగా తమకు రూ. 11 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని వ్యాపార సంఘం పేర్కొంది.
దీపావళి పండుగ సమయంలో తమకు గిరాకీ ఉంటుందని, ర్యాలీని వాయిదా వేసుకోవాలని గతంలోనే ట్రేడర్స్ అసోసియేషన్ కోరింది. ఇతర ప్రాంతాల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఇండియా కూటమి వారి అభ్యర్థనను పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించింది. పండుగలు, షాపింగ్ సీజన్ జరుగుతున్న తరుణంలో ఈ ర్యాలీ నిర్వహించడంతో, వేదిక చుట్టుపక్కల ఉన్న అనేక ప్రధాన మార్కెట్లు మూతపడ్డాయి. ఈ ర్యాలీ వల్ల వ్యాపారులకు రూ. 11,000 కోట్ల వ్యాపార నష్టం జరిగిందని ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ వెల్లడించింది.
INDIA Alliance Rally | వ్యాపారాలు నిలిచిపోయాయి
సీటీఐ ఛైర్మన్ బ్రిజేష్ గోయల్ మాట్లాడుతూ.. నవంబర్ 1న ఢిల్లీ సుమారు రూ. 11,000 కోట్ల ప్రత్యక్ష నష్టాన్ని చవిచూసిందన్నారు. ఇందులో రిటైల్ మరియు హోల్‌సేల్ వ్యాపార రంగాలకు రూ. 8,800 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రామ్‌లీలా మైదాన్ చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలో వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. ఆయా మార్కెట్లలో సుమారు 3 లక్షల దుకాణాలు ఉండగా, అందులో దాదాపు 2.5 లక్షల దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయని, దీనివల్ల వ్యాపార కార్యకలాపాలు 80 శాతం మేర స్తంభించిపోయాయని పేర్కొన్నారు. 10 కిలోమీటర్ల పరిధిలో వస్తువుల రవాణా నిలిచిపోవడంతో, రవాణా లాజిస్టిక్స్ రంగానికి కూడా రూ. 1,500 కోట్ల నష్టం వాటిల్లిందని వ్యాపార సంఘం తెలిపింది.
ఇది కూడా చదవండి..: Punjab AAP MLAs | పంజాబ్‌లో ‘ఆప్’కు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు