Murassu Cyclone | తగ్గిన మురాస్​ తుపాన్​ ప్రభావం

మురాసు తుపాన్​ పోవడంతో వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Murassu Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన మురాసు తుపాన్ ప్రభావం తగ్గిపోయింది. తీరం దాటిన అనంతరం తుపాన్​ బలహీనపడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.

తుపాన్​ ప్రభావంతో నాలుగు రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో సైతం వానలు దంచి కొట్టాయి. అయితే తుపాన్​ పోవడంతో వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తుపాన్​ ఫలితంగా మిగిలిపోయిన తేమ కారణంగా ఈ రోజు దక్షిణ, తూర్పు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.

Murassu Cyclone | ఆ జిల్లాల్లో..

నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 7/8 తేదీల నుండి తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంటుంది. ఆ తర్వాత చలి తీవ్రత పెరుగుతుంది.

ఇది కూడా చదవండి..: Green SM cabs | హైదరాబాద్‌లోకి వియత్నాం ఎలక్ట్రిక్ క్యాబ్స్ ‘గ్రీన్ ఎస్ఎం’.. కిలోమీటర్‌కు రూ.9 మాత్రమే! ఓలా, ఉబెర్ డ్రైవర్లలో ఆందోళన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *