అక్షరటుడే వెబ్‌డెస్క్: Brillaince Platform | పీఆర్ (PR) టీమ్‌లు, కమ్యూనికేషన్స్ లీడర్లు , ఏజెన్సీల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొత్త బ్రాండ్ అండ్ రెపుటేషన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ‘బ్రిలియెన్స్’ (Brillaince) మార్కెట్లోకి వచ్చింది. డీఏవీ మీడియా (DAV Media) సంస్థ అభివృద్ధి చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. బ్రాండ్ సంభాషణలను పర్యవేక్షించడం, నష్టాలు లేదా ముప్పులను ముందుగానే గుర్తించడం, తద్వారా తక్షణ చర్యలు తీసుకునేలా కమ్యూనికేషన్స్ బృందాలకు సహాయపడుతుంది.
Brillaince Platform | విభిన్న ఫీచర్లు..
ప్రస్తుత కాలంలో బ్రాండ్లపై చర్చలు కేవలం వార్తాపత్రికలకే పరిమితం కాకుండా సోషల్ మీడియా, వీడియో ప్లాట్‌ఫామ్‌లు, ఆన్లైన్ రివ్యూలు, ఏఐ (AI) జనరేటెడ్ సమాచారంలోనూ విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమాచారాన్ని అనుసంధానించడంలో ఉన్న సవాళ్లను అధిగమించడానికి బ్రిలియెన్స్ రూపొందించబడింది. ఇది భారత్‌లో తయారైన ప్లాట్‌ఫామ్ కావడం విశేషం. ఇది మీడియా మానిటరింగ్, షేర్-ఆఫ్-వాయిస్ విశ్లేషణ, క్రైసిస్ డిటెక్షన్, జర్నలిస్ట్ ఇంటెలిజెన్స్, కంటెంట్ అసిస్టెన్స్ , ఏఐ రెపుటేషన్ ట్రాకింగ్ వంటి సేవలను ఒకే గొడుగు కింద అందిస్తుంది.
Brillaince Platform | 40కి పైగా భాషల్లో మానిటరింగ్..
భారతదేశపు బహుభాషా , వేగంగా మారుతున్న మీడియా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలు, 40కి పైగా భాషల్లోని 100,000 పైచిలుకు సోర్సులను మానిటర్ చేస్తుంది. కేవలం సాధారణ వార్తలు, సోషల్ మీడియా (Instagram, X, Threads, Reddit, Quora) మాత్రమే కాకుండా.. యూట్యూబ్ క్రియేటర్లు, యాప్ స్టోర్ రివ్యూలు, ఎంప్లాయర్ రివ్యూ ప్లాట్‌ఫామ్‌లను కూడా ఇది ట్రాక్ చేస్తుంది. అంతేకాకుండా, చాట్‌జీపీటీ (ChatGPT), జెమిని (Gemini), పెర్ప్లెక్సిటీ (Perplexity) , గూగుల్ ఏఐ ఓవర్వ్యూస్ (Google AI Overviews) వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజిన్లు ఒక బ్రాండ్‌ను ఏవిధంగా ప్రదర్శిస్తున్నాయో కూడా ఇది విశ్లేషిస్తుంది.
Brillaince Platform | యాక్షన్ సెంటర్ ..
కేవలం డాష్‌బోర్డ్‌లను చూపించడమే కాకుండా, సమస్యల తీవ్రతను బట్టి తక్షణ చర్యలు తీసుకునేలా ‘యాక్షన్ సెంటర్’ సహకరిస్తుంది. ఇందులో ఉండే ‘వెలాసిటీ క్లాక్’ ద్వారా సాధారణ విషయాలకు, ప్రమాదకరమైన అంశాలకు మధ్య తేటతెల్లం తెలుసుకోవచ్చు. అలాగే ‘కంటెంట్ స్టూడియో’ ద్వారా ప్రెస్ స్టేట్మెంట్లు, మీడియా పిచ్ ఈమెయిల్స్, సోషల్ మీడియా రిప్లైలను వివిధ భాషల్లో త్వరగా డ్రాఫ్ట్ చేసుకోవచ్చు.
“భారతదేశపు విభిన్న మీడియా రంగాన్ని దృష్టిలో ఉంచుకునే బ్రిలియెన్స్ను రూపొందించాం. కేవలం సమాచారాన్ని ట్రాక్ చేయడమే కాకుండా, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా కమ్యూనికేషన్స్ బృందాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది” అని డీఏవీ మీడియా ఫౌండర్ విఘ్నేష్ చంద్రశేఖర్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Air India Hijack Threat | ఎయిరిండియా విమానం నుంచి హైజాక్ అలర్ట్