Kartika Purnima 2026 | కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారు? దీని పురాణ మహత్యం ఏమిటంటే..

సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kartika Purnima 2026 | సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి విశేష ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24 (మంగళవారం) వచ్చింది. ఈ రోజు భక్తిశ్రద్ధలతో పరమశివుడిని  (  Shiva )ఆరాధించడం, శివాలయాలను దర్శించుకోవడం వల్ల సమస్త పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.

Kartika Purnima 2026 | త్రిపుర పౌర్ణమి మహత్యం..

పురాణ కథనాల ప్రకారం.. కార్తీక పౌర్ణమి నాడే పరమశివుడు త్రిపురాసురులను సంహరించారు. అందువల్లే ఈ తిథిని ‘త్రిపుర పౌర్ణమి’ అని కూడా పిలుస్తారు. హరిహరులకు అత్యంత ప్రీతికరమైన ఈ రోజున చేసే పూజలు, జపాలు, దానధర్మాలు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయని స్కాంద పురాణం పేర్కొంటోంది.

Kartika Purnima 2026 | పుణ్యస్నానం, ఆచారాలు..

కార్తీక పౌర్ణమి రోజు భక్తులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నదులు, చెరువులు లేదా సరస్సులలో పుణ్యస్నానం ఆచరిస్తారు. నదులు లేదా జలాశయాలకు వెళ్లలేని వారు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. స్నానపు నీటిలో గంగాజలం లేదా తులసి దళాలు కలిపి, పవిత్ర నదుల పేర్లను స్మరించుకుంటూ స్నానం చేయడం శ్రేయస్కరమని పండితులు సూచిస్తున్నారు.

Kartika Purnima 2026 | పూజా విధానం..

కార్తీక పౌర్ణమి రోజు  శివాలయాలకు వెళ్లి శివలింగానికి రుద్రాభిషేకం చేయడం ఎంతో ఫలప్రదం. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో కూడిన పంచామృతాలతో అభిషేకం చేసి, మారేడు దళాలతో అర్చించాలి. అనంతరం శివుడి అష్టోత్తర శతనామాలను (108 నామాలు) స్మరించడం, దీపారాధన, గౌరీపూజ చేయడం వల్ల శివానుగ్రహం లభిస్తుందని విశ్వాసం.

ఇది కూడా చదవండి:  Akula Kalpana Appointment | మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలిగా ఆకుల కల్పన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *