Rajiv Gandhi Assassination | రాజీవ్​ గాంధీ హత్యపై రాహుల్​ సంచలన వ్యాఖ్యలు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajiv Gandhi Assassination | మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాన్నను చంపడానికే ఆయన భద్రతను తొలగించారు” అన్నారు.

తన తల్లి ఆత్మకథ గురించి చర్చిస్తున్న ఒక వీడియోలో సోనియా గాంధీ, తన సోదరి ప్రియాంకతో కలిసి కనిపించిన రాహుల్, “నాన్నను చంపడానికే ఆయన భద్రతను తొలగించారు” అని ఆరోపించారు. ఇందిరా గాంధీ హత్య తర్వాత రాజీవ్​ అనుకోకుండా పీఎం అయ్యారు. సంవత్సరాల తరబడి, ఆయన బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ ధరించి, భారీ భద్రత మధ్య ఉన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.

Rajiv Gandhi Assassination | రాళ్లదాడి చేశారు

రాజీవ్​ గాంధీ మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌కు వెళ్లారు. అక్కడ ఓ మహిళ పూలదండ వేయడానికి వచ్చి, ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ చనిపోయాడు. శ్రీపెరంబదూర్‌కు వెళ్లడానికి కొద్దిసేపటి ముందే, రాహుల్ తన తండ్రితో కలిసి బీహార్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఆయనపై రాళ్ల దాడి జరిగిందని రాహుల్ గాంధీ తెలిపారు. సరైన భద్రత లేనప్పుడు, పైగా ప్రతిపక్ష పార్టీ (బీజేపీ వంటివి) అధికారంలో ఉన్న రాష్ట్రానికి వెళ్లినప్పుడు, అక్కడ బాధ్యతలో ఉన్నవారు భద్రత విషయంలో పెద్దగా శ్రద్ధ వహించరని సోనియా గాంధీ అన్నారు.

ఇది కూడా చదవండి..: Delhi Police Station Attack | పోలీస్ స్టేషన్‌లోనే కత్తితో వీరంగం : 9 మంది పోలీసులపై దాడి.. ఎట్టకేలకు కాల్పులతో నిందితుడికి చెక్!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *