అక్షరటుడే మెండోరా: Karthika Pournami | శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (Sriramsagar Project) పరిధిలోని పోచంపాడ్ గ్రామంలో రామాలయాలు, శివాలయాల్లో కార్తీక శోభను సంతరించుకున్నాయి. గోదావరి నది తీరాన ఉన్న ఈ ఆలయాలకు భక్తులు పోటెత్తారు భక్తులు పోటెత్తారు.
Karthika Pournami | సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన..

సుమారు 50 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం, శివాలయాలు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. తెల్లవారుజామునే గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరికాయ దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో దీపారాధనలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా ఆకాశ దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో వేణు, ఆలయ కమిటీ సభ్యులు చందు, సతీష్, పంతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: BRS Kamareddy | కామారెడ్డిపై ‘గులాబీ’ గురి..! పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు..