అక్షరటుడే వెబ్‌డెస్క్: Atria University Admissions 2027 | భారతదేశపు తొలి లిబరల్ స్టెమ్ (STEM) విశ్వవిద్యాలయమైన ఏట్రియా యూనివర్సిటీ 2027-28 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ విశ్వవిద్యాలయం నాలుగు ప్రధాన విభాగాల్లో 270 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లతో పాటు BS, MS బై రీసెర్చ్, PhD ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో లోతైన పరిజ్ఞానాన్ని వివిధ రంగాల ఆచరణాత్మక అభ్యసనంతో అనుసంధానించేలా ఈ లిబరల్ స్టెమ్ విధానాన్ని రూపొందించారు.
Atria University Admissions 2027 | రూ.20 కోట్ల స్కాలర్షిప్లు..
అంతర విభాగ, పరిశోధన ఆధారిత విద్యా విధానంలో భాగంగా కోర్సును బట్టి విద్యార్థులకు 9 నుంచి 12 నెలల పాటు పరిశ్రమల్లో పనిచేసే అనుభవం కల్పిస్తారు. జాన్సన్ & జాన్సన్, ఆల్టైర్, ఏథర్ ఎనర్జీ, గెలాక్సీఐ స్పేస్, ఐఐహెచ్ఎస్, డబ్ల్యుఆర్ఐ వంటి దిగ్గజ సంస్థల్లో ప్లేస్మెంట్ అవకాశాలు లభిస్తాయి. 2026-27 విద్యా సంవత్సరంలో 100 శాతం విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తూ సుమారు రూ.20 కోట్ల విలువైన మెరిట్ స్కాలర్షిప్లను యూనివర్సిటీ పంపిణీ చేసింది.
Atria University Admissions 2027 | సరికొత్త స్పెషలైజేషన్లు..
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, లైఫ్ సైన్సెస్, ఎనర్జీ సైన్సెస్, ఇ-మొబిలిటీ విభాగాల్లో ఏట్రియా ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. 2027-28 సంవత్సరానికి కోర్ ఏఐ & ఫౌండేషన్ మోడల్స్, ఏఐ స్టివార్డ్ (రెస్పాన్సిబుల్ ఏఐ), సైబర్‌సెక్యూరిటీ & బ్లాక్‌చెయిన్, హెల్త్‌కేర్‌లో ఏఐ, 3డి బయోప్రింటింగ్ వంటి కొత్త స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టింది. విద్యార్థులు తమ ప్రత్యేక విభాగాన్ని ఎంచుకునే ముందు గణితం, ప్రోగ్రామింగ్, రసాయన శాస్త్రం, అణు జీవశాస్త్రం, ఇంధనం, చలనశీలత అంశాల్లో మూడు వారాల చొప్పున జరిగే ప్రాథమిక కోర్సులతో మొదటి ఏడాది పునాది వేసుకుంటారు.
Atria University Admissions 2027 | హైదరాబాద్ వృద్ధితో అనుసంధానం..
రాబోయే రెండు మూడేళ్లలో ఈ రంగాల్లో నిపుణులకు భారీ డిమాండ్ ఏర్పడనుంది. బెయిన్ అండ్ కంపెనీ అంచనాల ప్రకారం 2027 నాటికి భారత్‌లో ఏఐ ఉద్యోగ ఖాళీలు 23 లక్షలు దాటనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఏటా 15-20 శాతం నియామకాలు పెరుగుతాయని అడెక్కో ఇండియా, 2030 నాటికి స్వచ్ఛ ఇంధన రంగంలో 44 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని సీఈఈడబ్ల్యూ-ఎన్ఆర్డీసీ అంచనా వేస్తున్నాయి. బయో ఎకానమీ రంగం సైతం 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
హైదరాబాద్ ( Hyderabad )ఆర్థిక వృద్ధికి తోడ్పడే రంగాలకు ఏట్రియా కోర్సులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఆగస్టు 2026 నాటికి హైదరాబాద్‌లో ఏఐ/ఎంఎల్ నియామకాల్లో వార్షికంగా 48 శాతం వృద్ధి నమోదైంది. 2030 నాటికి 5 లక్షల ఉద్యోగాలు, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ‘నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30’ని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఏట్రియా 2026-27 బ్యాచ్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 84 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Atria University Admissions 2027 | సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్..
సిన్బయోఏఐ, ఏజెంటిక్ క్యాంపస్ మైక్రోగ్రిడ్ వంటి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విద్యార్థులకు వాస్తవ పారిశ్రామిక సవాళ్లపై పరిశోధన చేసే అవకాశం లభిస్తోంది. ఏథర్ ఎనర్జీ, సన్ మొబిలిటీ, ముసాషి ఇండియా, మినీమైన్స్, క్రిస్పర్‌బిట్స్ సంస్థల భాగస్వామ్యంతో బయోటెక్నాలజీ, ఇంధన నిల్వ, ఇ-మొబిలిటీ రంగాల్లో ఆచరణాత్మక శిక్షణ అందుతోంది. ఏఐ, లైఫ్ సైన్సెస్, ఇంధన రంగాల్లో వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ వంటి నగరాలకు బహుళ రంగాల అవగాహన ఉన్న గ్రాడ్యుయేట్లే నాయకత్వం వహిస్తారని, 2027-28 బ్యాచ్‌లోకి తెలంగాణ విద్యార్థులను ఆహ్వానిస్తున్నామని ఏట్రియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజీవన్ మాధవన్ నాయర్ తెలిపారు.
Atria University Admissions 2027 | దరఖాస్తు విధానం..
ACT ఫైబర్‌నెట్ వ్యవస్థాపకుడు డాక్టర్ సుందర్ రాజు నేతృత్వంలోని ఏట్రియా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ విశ్వవిద్యాలయం నడుస్తోంది. 2027-28 విద్యా సంవత్సరానికి అక్టోబర్ 31, 2027 వరకు ఏట్రియా యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన, వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. మెరిట్ స్కాలర్‌షిప్‌ల కోసం SAT, JEE, CUET స్కోర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఇది కూడా చదవండి: Seethakka Apology | కవితకు క్షమాపణ చెప్పిన మంత్రి సీతక్క