Seethakka Apology | కవితకు క్షమాపణ చెప్పిన మంత్రి సీతక్క

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, మంత్రి సీతక్క క్షమాపణ చెప్పారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Seethakka Apology | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు, మంత్రి సీతక్క క్షమాపణ చెప్పారు. ఆమె గురించి మాట్లాడుతుండగా.. పొరపాటున వచ్చిన మాటను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.

మంత్రి సీతక్క సోమవారం ములుగు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్​పై విమర్శలు చేశారు. ఇటీవల కవిత తనకు క్యాన్సర్​ ఉందని కేటీఆర్​ ప్రచారం చేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సీతక్క, కేటీఆర్​ను విమర్శించే క్రమంలో సొంత చెల్లికి క్యాన్సర్​ ఉందని ప్రచారం చేయించారని అనబోయి ఎయిడ్స్​ అన్నారు. దీనిపై తాజాగా ఆమె క్షమాపణ చెప్పారు. కవిత ప్రస్తావన రావడంతో కాన్సర్ పదానికి బదులుగా వేరే పదం పొరపాటుగా మాట్లాడినందుకు సారీ చెప్పారు.

Seethakka Apology | పొరపాటున దొర్లింది

కల్వకుంట్ల కవితపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని టీఆర్​ఎస్​ డిమాండ్​ చేసింది. బాధ్యత గల మంత్రి హోదాలో ఉండి ఒక మహిళా నాయకురాలిపై దారుణ వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని పేర్కొంది. ఈ క్రమంలో సీతక్క వీడియో విడుదల చేశారు. ఆ పదం అనుకోకుండా దొర్లిందన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఆ మాట అనలేదని చెప్పారు. వ్యక్తులను రాజకీయంగా ఎదురుకుంటాం కానీ వ్యక్తిగతంగా తూలనాడమని ఆమె స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎయిడ్స్​ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు పంపిణీ చేయడంతో, క్యాన్సర్​కు బదులు ఎయిడ్స్​ అని వచ్చిందన్నారు. దీనిపై క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు.

దీనిని కూడా చదవండి : Fake Currency Scam | నకిలీ నోట్లతో మోసం చేస్తున్న ముఠా అరెస్ట్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *