అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Currency Scam | నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న నోట్లతో మోసాలకు పాల్పడుతుండటం గమనార్హం.
ఆదిలాబాద్ పోలీసులు ఈ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను తాజాగా అరెస్టు చేశారు. మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే మరో కేసులో కస్టడీలో ఉన్నారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు నోట్ల కట్టల పైభాగంలో, దిగువన అసలు నోట్లను ఉంచి, మధ్యలో నకిలీ నోట్లను దాచి మోసాలకు పాల్పడుతోంది. క్షుద్రపూజలు చేసి డబ్బులను రెట్టింపు చేస్తామని నమ్మించేవారు. అనంతరం అసలు నోట్ల మధ్య నకిలీ నోట్లు పెట్టి బాధితులకు ఇచ్చేవారు.
Fake Currency Scam | భారీగా ఫేక్ కరెన్సీ స్వాధీనం
నిందితుల నుంచి పోలీసులు రూ. 40 లక్షల విలువైన 99 నకిలీ కరెన్సీ కట్టలను, 100 నకిలీ బంగారు నాణేలను, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరి వద్ద రద్దయిన పాత నోట్లు సైతం ఉన్నాయి. వీరి వలలో పడి మంచిర్యాలకు చెందిన ఒక వ్యక్తి రూ.8 లక్షలు మోస పోయాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 40 మంది బాధితులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. డబ్బు కోల్పోయిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.
🚨 చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు. ఆరుగురిపై కేసు, నలుగురు అరెస్ట్. రూ.40 లక్షలకు పైగా విలువైన నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు స్వాధీనం. బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి.
#AdilabadPolice #CrimeAlert
@TelanganaDGP @TelanganaCOPs https://t.co/Q8nTJ5TsCa— Akhil Mahajan IPS (@adilabad_sp) November 24, 2026
దీనిని కూడా చదవండి : Indiramma Sarees | కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు