అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Collector Garima Agarwal | ఖేలో ఇండియా(Khelo India) పోటీల్లో క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ చూపాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో క్రీడాకారుల క్యాంప్ కొనసాగుతుండగా ఆమె పరిశీలించారు.
Collector Garima Agarwal | స్టేడియంలో వసతులపై ఆరా
స్టేడియంలో వసతి గదులు, కిచెన్, మెనూ చార్ట్‌ను పరిశీలించారు. స్టేడియం ఆవరణలో పరిశీలించి.. అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఆహార పదార్థాలు తనిఖీ చేశారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు రాగా, వారిని కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. వాలీబాల్ పోటీలు చూసి.. అక్కడి నుంచి ఆర్చరీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ సైతం ఆర్చరీ ఆడి.. క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పలువురు క్రీడాకారులు ఇటీవల ప్రతిభ చూపగా, వారిని అభినందించారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Collector Garima Agarwal | వాలీబాల్ అకాడమీలో..
48 మంది వాలీబాల్ అకాడమీ సిరిసిల్లలో వాలీబాల్ శిక్షణ తీసుకుంటున్నారు. ఇక్కడ శిక్షణ పొంది ఎంపికైన అభ్యర్థులు వచ్చే నెల డిసెంబర్ 11 వ తేదీ నుంచి 22 డిసెంబర్ వరకు హైదరాబాద్ తోపాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ పట్టణాలలో ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్ లో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి: #NannaKutty ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అదిరిపోయిన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్!