Indiramma Family Insurance | అర్హులైన ప్రతి కుటుంబానికి బీమా సదుపాయం: వివేక్ వెంకటస్వామి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకాన్ని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 2026 నవంబర్ 24న మంచిర్యాల జిల్లాలో ప్రారంభించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Family Insurance | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘ఇందిరమ్మ కుటుంబ బీమా’ పథకాన్ని కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి  2026 నవంబర్ 24న మంచిర్యాల జిల్లాలో ప్రారంభించారు. చెన్నూరు మండలం గంగారం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన మంత్రి.. దేశంలో మరెక్కడా లేని విధంగా కుటుంబ బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ( Telangana )అని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆపదలో ఉన్న కుటుంబాలకు ఈ బీమా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

Indiramma Family Insurance | అధికారులకు ఆదేశాలు..

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా చేరేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎంపీడీవో అజ్మత్ అలీ, సర్పంచ్‌లు, అధికారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Indiramma Family Insurance | గత ప్రభుత్వాలతో పోలిక..

గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద, బడుగు, బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లు, భూములు పంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 40 లక్షల మందికే రైతు బీమా పరిమితమైందని, భూమి ఉన్నవారికే బీమా అందేదని అన్నారు. కానీ ఇప్పుడు కోటి మందికి పైగా కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ బీమా సదుపాయం కల్పిస్తూ ప్రతి అర్హ కుటుంబానికి రక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.

Indiramma Family Insurance | అభివృద్ధి పనుల వివరాలు..

గంగారం గ్రామానికి అడిగిన వెంటనే 25 ఇండ్లు, సుమారు రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలోనే చెన్నూరులో బస్ డిపో, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకోబోతున్నట్లు వెల్లడించారు. సోమనపల్లిలో రూ.250 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు వేగంగా జరుగుతున్నాయని, పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.70 కోట్లతో పనులు ప్రారంభించనున్నట్లు వివరించారు.

Indiramma Family Insurance | ఇతర సంక్షేమ పథకాల ప్రస్తావన..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం రూ.9 వేల కోట్లు చెల్లించిందని మంత్రి పేర్కొన్నారు. సన్న బియ్యం పంపిణీ కోసం రూ.25 కోట్లు చెల్లిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని నిరంతరం అందిస్తున్నట్లు గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి:  Hyderabad Congestion Charges | హైదరాబాద్ ట్రాఫిక్‌కు కంజెషన్ ఛార్జీల చెక్.. కారులో ఒక్కరే వెళితే జరిమానా..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *