Indiramma Sarees | కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలు

రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indiramma Sarees | రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. నవంబర్ 26న నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

‘ఇందిర మహిళా శక్తి’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 65 లక్షల మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మంది మహిళలకు ఈ చీరలను అందించనున్నారు. చిలుక పచ్చ రంగులో రూపొందించిన ఈ చీరలు, నాణ్యత మరియు మన్నికతో పాటు ఆధునిక డిజైన్లను, సాంప్రదాయ శైలిని కలిగి ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

Indiramma Sarees | పాలిస్టర్​ చీరలు

వీటిలో 95 లక్షల పాలిస్టర్ చీరలు 6.30 మీటర్ల పొడవు ఉండగా, 5 లక్షల పాలి-కాటన్ చీరలు 9 మీటర్ల పొడవు ఉంటాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన చేనేత కార్మికులచే ఈ చీరలు నేస్తున్నారు. మహిళలకు కానుక అందజేయడమే కాకుండా, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేలా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది.

Indiramma Sarees | వీరు అర్హులు

రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలకు చెందిన, 18 ఏళ్లకంటే ఎక్కువ వయస్సు గల మహిళలందరూ ఈ పథకానికి అర్హులు. కలెక్టర్లు, ఇన్-ఛార్జ్ మంత్రుల పర్యవేక్షణలో గ్రామాల్లో, పట్టణ వార్డుల్లో ఈ పంపిణీ జరుగుతుంది. అర్హులైన మహిళలు తమ రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు మరియు ఆధార్ వివరాలను చూపించి చీరలను పొందవచ్చు. లబ్ధిదారుల వివరాలను నమోదు చేయడానికి, పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడటానికి ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తారు.

ఇది కూడా చదవండి..: Harish Rao | తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్: హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *