అక్షరటుడే, వెబ్‌డెస్క్ : School Picnic Tragedy | విహార యాత్రలో విషాదం చోటు చేసుకుంది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పిక్నిక్కు వెళ్లిన ఓ పదేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఇనుప ఊయల వద్ద ఆడుకుంటూ చనిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి (Rangareddy) జిల్లా మొయినాబాద్‌లో శనివారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నార్సింగి (Narsingi)లోని హ్యాపీ స్కాలర్స్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను శనివారం పిక్నిక్కు తీసుకు వెళ్లింది. విద్యార్థులంతా కలిసి మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్కుకు వెళ్లారు. అక్కడ అందరు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో సుమారు 10 మంది పిల్లలు ఒక భారీ ఊయల మీద కూర్చోగా, కొంతమంది దానిని వెనక నుంచి ఊపారు. ఈ క్రమంలో ఇనుప ఊయల తగలడంతో టి. అభిరామ్ అనే విద్యార్థి చనిపోయాడు. పక్కనే ఉన్న మరో విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. వేగంగా కదులుతున్న ఊయల వెనక్కి వచ్చి పిల్లలకు తగలడంతో ప్రమాదం చోటు చేనసుకుంది.
School Picnic Tragedy | పాఠశాలపై కేసు నమోదు
చిన్నారులు పార్కులో ఆడుకుంటున్న సమయంలో పర్యవేక్షణ లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు బాలుడి తండ్రి ఆరోపించారు. ఆ సమయంలో ఊయల దగ్గర ఉపాధ్యాయులు గానీ, పాఠశాల సిబ్బంది గానీ లేరని విద్యార్థులు తెలిపారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మరణించాడని అభిరామ్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
దీనిని కూడా చదవండి : Harish Rao | తెలంగాణను సర్వనాశనం చేసిందే కాంగ్రెస్: హరీశ్‌రావు