Bhanu Prakash Reddy | కొల్హాపూర్ అమ్మవారి పట్టు వస్త్రాలు స్వీకరించడం నా పూర్వజన్మ సుకృతం: బీజేపీ సీనియర్ నేత భాను ప్రకాష్ రెడ్డి

ఆ జగన్మాత దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhanu Prakash Reddy | పవిత్ర కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పట్టు వస్త్రాలను స్వీకరించే మహద్భాగ్యం కలగడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని బీజేపీ సీనియర్ నాయకులు, టీటీడీ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Bhanu Prakash Reddy | అమ్మవారి కృపతో..

ఈ సందర్భంగా ఆయన తన భక్తిభావాన్ని పంచుకుంటూ, ఆ జగన్మాత దివ్య ఆశీస్సులు, కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

కష్టనష్టాల నుంచి గట్టెక్కించి, అమ్మవారి చల్లని చూపు మనందరికీ కొండంత అండగా నిలవాలని కోరుకుంటున్నట్లు భాను ప్రకాష్ రెడ్డి ఆకాంక్షించారు. అనంతరం “జై కొల్హాపూర్ అమ్మవారు.. జై మాతా దీ” అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *