Mauritius Earthquake News | మారిషస్ సమీపంలో 6.4 తీవ్రతతో భారీ భూకంపం.. వణికిపోయిన హిందూ మహాసముద్రం!

మారిషస్‌తో పాటు సమీపంలోని రీయూనియన్ దీవులకు అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mauritius Earthquake News | హిందూ మహాసముద్రంలోని ప్రముఖ పర్యాటక ద్వీప దేశం మారిషస్ సమీపంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైనట్లు భూకంప అధ్యయన కేంద్రం అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో ద్వీపమంతా ఒక్కసారిగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Mauritius Earthquake News | ప్రస్తుతం ద్వీపంలో పరిస్థితి

ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న ప్రజలు భయాందోళనలతో ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భారీ భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరిగినట్లు నివేదికలు అందలేదని అధికారులు ప్రాథమిక సమాచారం అందించారు. భవనాలు దెబ్బతిన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని తెలిపారు.

మరోవైపు, భూకంపం నేపథ్యంలో సముద్ర అలల ఉద్ధృతిపై ఆందోళన నెలకొన్నప్పటికీ.. మారిషస్‌తో పాటు సమీపంలోని రీయూనియన్ దీవులకు అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. ప్రస్తుతం ద్వీపంలో పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మారిషస్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *