Power Cut | విద్యుత్​ వినియోగదారులకు అలర్ట్​.. నేడు నగరంలో పవర్​ కట్​..

నిజామాబాద్​ నగరంలో 28వ తేదీ విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజమాబాద్​ సిటీ: Power Cut | నగరంలో (Nizamabad) 28వ తేదీ విద్యుత్​ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు విద్యుత్​శాఖ టౌన్​–3 ఏడీఈ వినోద్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.

Power Cut | వినాయక్​నగర్​లోని ఆయా ప్రాంతాల్లో..

వినాయక్​ నగర్ 33/11 కేవీ సబ్‌స్టేషన్​ పరిధిలోని 11 కేవీ వినాయక్​ నగర్–2 ఫీడర్​ పరిధిలోని టవర్స్​ పనులు జరుగుతున్నాయని వినోద్​ తెలిపారు. ఈ సందర్భంగా 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు విద్యుత్​ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. ఈ ఫీడర్​ పరిధిలోని యాదగిరి బాగ్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐదు చేతుల పోచమ్మ, అగర్వాల్​ హాస్పిటల్​, వెస్ట్​ సైడ్​ షాప్​, శివాలయం ఏరియాల్లో విద్యుత్​ సరఫరా ఉండదని పేర్కొన్నారు. విద్యుత్​ వినియోగదారులు సహకరించాలని, ఇతర వివరాలకు 8712485801, 8712481912 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

ఇది కూడా చదవండి: డింపుల్ ఈ సినిమాలో..అసలు ఏమీ చూపించలేదు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *