జాతీయంIndia Election Shocks| సొంత నియోజకవర్గాల్లో వెనుకబడ్డ హేమాహేమీలు.. ముగ్గురు సీఎంలకు షాక్.

India Election Shocks| సొంత నియోజకవర్గాల్లో వెనుకబడ్డ హేమాహేమీలు.. ముగ్గురు సీఎంలకు షాక్.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Election Shocks| పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి తొలి రౌండ్ల నుంచే ఆమెపై ఆధిక్యం కనబరుస్తూ షాక్ ఇచ్చారు. ప్రతి రౌండ్‌లోనూ ఫలితం మారుతున్నప్పటికీ, సీఎం వెనుకంజలో ఉండటం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

India Election Shocks|తమిళనాడులో స్టాలిన్‌కు ‘విజయ్’ బ్రేక్..

తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆయన కంచుకోట అయిన కొళత్తూరులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) అభ్యర్థి వీఎస్. బాబు ముందంజలో ఉన్నారు. దశాబ్దాలుగా డీఎంకేకు కిల్లేలాంటి ఈ నియోజకవర్గంలో స్టాలిన్ వెనుకబడటం ద్రవిడ రాజకీయాల్లో మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.

India Election Shocks|..కేరళలో విజయన్‌కు ఎదురుగాలి:

వరుసగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఓటర్లు షాక్ ఇచ్చారు. తన సొంత నియోజకవర్గమైన ధర్మదంలో యూడీఎఫ్ అభ్యర్థి అబ్దుల్ రషీద్ కంటే ఆయన వెనుకబడి ఉన్నారు. కేరళలో హ్యాట్రిక్ కొట్టాలనుకున్న విజయన్‌కు ఈ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: APNRTS Rescue Oman| ఒమన్‌లో బాధితురాలికి బాబు భరోసా.. మే 7న స్వగ్రామానికి రానున్న షహ్నాజ్ !

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sun TV Shares | తమిళనాడులో డీఎంకే ఓటమి.. కుప్పకూలిన సన్ టీవీ షేర్లు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sun TV Shares | తమిళనాడు అసెంబ్లీ...

Mamata Banerjee Statement| అంతిమ విజయం తృణమూల్ దే.. బెంగాల్ గడ్డపై దీదీ ధీమా!

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mamata Banerjee Statement| పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల...

Armoor Municipal Commissioner | ఆర్మూర్​ మున్సిపల్ కమిషనర్​గా శ్రీహరి రాజు బాధ్యతల స్వీకరణ

అక్షరటుడే ఆర్మూర్ : Armoor Municipal Commissioner | ఆర్మూర్ మున్సిపల్...

Political Earthquake | బ్లడీ హెల్.. ఇది రాజకీయ భూకంపం! ఐదు రాష్ట్రాల కౌంటింగ్ ట్రెండ్స్‌పై సీఎం ఒమర్ అబ్దుల్లా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Political Earthquake | దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన...