అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sri City AC Industry | తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీసిటీలో క్యారియర్ ఏసీల పరిశ్రమకు మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) శంకుస్థాపన చేశారు.
శ్రీసిటీలో ఉత్పత్తి సంస్థను ప్రారంభించనున్న అమెరికాకు చెందిన దిగ్గజ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ ‘క్యారియర్’..దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో గృహేతర వినియోగానికి సంబంధించిన భారీ ఏసీలను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ సంస్థకు ప్రభుత్వం సుమారు 40 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 3,000 మందికి (1000 ప్రత్యక్ష, 2000 పరోక్ష) ఉపాధి లభిస్తుందని అంచనా.
Sri City AC Industry | ఏసీల తయారీ హబ్‌గా
సౌత్ ఇండియా (South India)లో ఎయిర్ కండిషన్ల తయారీ కేంద్రంగా శ్రీసిటీ మారనుంది. ఇప్పటికే అనేక కంపెనీలు విడి భాగాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పాయి. ప్రభుత్వం అందిస్తున్న సహకారం, మౌలిక సదుపాయాలు, పోర్ట్ ఆధారిత లాజిస్టిక్స్ సేవల కారణంగా ప్రముఖ ఏసీ పరిశ్రమలు (AC Industries) తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో తయారయ్యే ఏసీల్లో దాదాపు 40 శాతం ఇక్కడే తయారు అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎల్జీ, డైకిన్ కంపెనీలు త్వరలో మరింత విస్తరించనున్నాయి. దీంతో 2028 నాటికి ఏసీల తయారీలో శ్రీ సిటీ వాటా 70 శాతానికి పెరిగే అవకాశం ఉందని అంచనా.
ఇది కూడా చదవండి..: Kadapa Murder Case | కడపలో దారుణం.. భార్య లావుగా ఉందన్న కోపంతో యూట్యూబ్‌లో వెతికి మరీ హత్య

