అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akhilesh I-PAC Deal | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ అధినేత (SP Chief) అఖిలేష్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐ –ప్యాక్‌తో ఒప్పందం రద్దు చేసుకున్నారు. బెంగాల్ (Bengal) ఎన్నికల్లో టీఎంసీకి ఆ సంస్థ సేవలు అందించింది. టీఎంసీ ఓటమితో ఐ-ప్యాక్‌తో అఖిలేష్ డీల్ రద్దు చేసుకున్నారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఎస్పీ చీఫ్ ఖండించారు.
రాజకీయ కారణాల కన్నా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఐ-ప్యాక్‌తో తమ పార్టీ అనుబంధాన్ని ముగించిందని బుధవారం తెలిపారు. 2027 అసెంబ్లీ ఎన్నికల కోసం ఐ-ప్యాక్‌తో కొద్దికాలం పాటు తమ పార్టీ ఒప్పందం కుదుర్చుకుందని, అయితే వనరుల కొరత కారణంగా ఆ ఏర్పాటును కొనసాగించలేకపోయిందని స్పష్టం చేశారు.
Akhilesh I-PAC Deal | సంస్థలకు కొరత లేదు
దేశవ్యాప్తంగా ప్రచార వ్యూహాలను నిర్వహించడంలో పేరుగాంచిన ఐ-ప్యాక్ గతంలో బీజేపీ, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలతో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ (Prashanth Kishore)తో అనుబంధం కలిగి ఉంది. పెరుగుతున్న రాజకీయ కన్సల్టెన్సీల వ్యవస్థపై అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. సర్వే ఏజెన్సీలు, సోషల్ మీడియా మేనేజర్ల నుంచి ప్రతికూల ప్రచారంలో ప్రత్యేకత కలిగిన సంస్థల వరకు ప్రచార సేవలను అందించే సంస్థలకు కొరత లేదని వ్యాఖ్యానించారు. వనరులు అందుబాటులో ఉంటే మరిన్ని ఇలాంటి కంపెనీలను చేర్చుకోవచ్చని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Minimum Pension Hike | కనీస పెన్షన్ రూ. 7,500.. పెంపు యోచనలో కేంద్ర ప్రభుత్వం!

