జాతీయంJailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jailer Love Story | ప్రేమకు సరిహద్దులు లేవని, హోదాలు అడ్డుకావని నిరూపించింది ఈ జంట. జైలు గదుల మధ్య మొదలైన ఒక పరిచయం.. చివరకు పెళ్లి పీటల వరకు చేరింది. జీవిత ఖైదు అనుభవించి విడుదలైన ఓ మాజీ ఖైదీని, అతనికి కాపలాగా ఉన్న మహిళా జైలు అధికారి వివాహం చేసుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Jailer Love Story | జైలులోనే ప్రేమ చిగురించింది..

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని సత్నా సెంట్రల్ జైలులో ఫిరోజా ఖాతూన్ డిప్యూటీ జైలర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే జైలులో ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ధర్మేంద్ర అలియాస్ అభిలాష్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. సుమారు 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న ధర్మేంద్ర, 2020లో విడుదలయ్యాడు. జైలులో ఉన్న సమయంలోనే వీరిద్దరి మధ్య చిగురించిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. విడుదలైన తర్వాత పెళ్లి చేసుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్న ఈ జంట, ఆ దిశగా అడుగులు వేసింది.

Jailer Love Story | హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం..

ఈ వివాహంలో మరో ప్రత్యేకత ఏమిటంటే మతపరమైన భేదాలు ఉన్నా వారు వెనకడుగు వేయలేదు. ముస్లిం కుటుంబానికి చెందిన ఫిరోజా, హిందూ మతానికి చెందిన ధర్మేంద్ర.. తమ వ్యక్తిగత నిర్ణయంతో ఒక్కటయ్యారు. ఇటీవల లవ్ కుష్ నగర్‌లో హిందూ సంప్రదాయాల ప్రకారం వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది. ఫిరోజా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి పూర్తి స్థాయిలో అంగీకరించనప్పటికీ, ఆమె తన నిర్ణయానికే కట్టుబడింది.

Jailer Love Story | సోషల్ మీడియాలో వైరల్..

తమ వివాహంపై స్పందించిన ఫిరోజా ఖాతూన్.. “ఇది మా వ్యక్తిగత నిర్ణయం. మా జీవితాల గురించి నిర్ణయించుకునే స్వేచ్ఛ మాకు ఉంది. మేము ఈ బంధంతో చాలా సంతోషంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు. జైలులో మొదలైన ఈ అరుదైన ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌గా మారింది. “నిజమైన ప్రేమకు నిదర్శనం” అంటూ నెటిజన్లు ఈ జంటను అభినందిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Kamal Haasan|తమిళనాడులో ‘హంగ్’ ప్రకంపనలు.. దళపతి విజయ్‌కు మద్దతుగా నిలిచిన కమల్ హాసన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...

Middle East | మధ్యప్రాచ్యంలో రణభేరి.. ఫుజైరా దాడితో మారిన ఇరాన్ – అమెరికా యుద్ధ గమనం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Middle East | మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు...

China Ex Defense Ministers|అవినీతిపై చైనా ఉక్కుపాదం..ఇద్దరు మాజీ రక్షణ శాఖ మంత్రులకు మరణశిక్ష

అక్షరటుడే వెబ్‌డెస్క్:China Ex Defense Ministers|అవినీతిపై పోరాటంలో భాగంగా చైనా ప్రభుత్వం...

Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు ద్వారా సంక్షేమ ఫలాలు పొందాలి

అక్షరటుడే, బాన్సువాడ: Labour Card Benefits | భవన నిర్మాణ కార్మికులు...