Wealth management mistakes | సంపాదన కోట్లలో ఉన్నా.. ఈ జాగ్రత్తలు లేకపోతే కష్టం బూడిదలో పోసిన పన్నీరే!

Naresh Chandan
Wealth management mistakes

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Wealth management mistakes : సొంత ఇల్లు, పొలాలు, బ్యాంకు బ్యాలెన్స్.. ఇలా మన పిల్లల కోసం రాత్రింబవళ్లు కష్టపడి ఆస్తులను కూడబెడతాం. కానీ, మనం సంపాదించిన ఆ కోట్లు మన తర్వాత వారసులకు క్షేమంగా చేరుతున్నాయా? అంటే చాలా సందర్భాల్లో ‘లేదు’ అనే సమాధానమే వినిపిస్తోంది.

సరైన ఆర్థిక అవగాహన లేకపోవడం, చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల దశాబ్దాల కష్టం నిమిషాల్లో ఆవిరైపోతోంది. అందుకే, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న ఈ ప్రాథమిక సూత్రాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందే.akshara earn 1

Wealth management mistakes | వీలునామా (Will) లేకపోవడం:

చాలా మంది ఆస్తులు కొంటారు కానీ, అవి తమ తర్వాత ఎవరికి చెందాలనేది పక్కాగా రాసి పెట్టరు. వీలునామా లేదా ఎస్టేట్ ప్లానింగ్ లేకపోతే, వారసులు ఆ ఆస్తి కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. చివరికి మన కష్టం లాయర్ల ఫీజులకే సరిపోయే ప్రమాదం ఉంది.

Wealth management mistakes | లగ్జరీ వ్యామోహం:

విలువ తగ్గే వస్తువులపై (ఉదాహరణకు విలాసవంతమైన కార్లు, బ్రాండెడ్ గ్యాడ్జెట్లు) మితిమీరి ఖర్చు చేయడం వల్ల పొదుపు కరిగిపోతుంది. సంపాదన పెరిగేకొద్దీ ఖర్చులు పెంచుకుంటూ పోతే, వారసత్వ సంపద నామమాత్రంగా మిగిలిపోతుంది.

Wealth management mistakes | చక్రవడ్డీ అప్పుల ఊబి:

క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల వంటి అధిక వడ్డీ ఉండే అప్పులు ఆర్థిక సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాయి. అవసరం లేకపోయినా అప్పులు చేసి విలాసాలు అనుభవించడం అనేది పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టడమే అవుతుంది.akshara money

బీమా రక్షణను విస్మరించడం:

సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోవడం అతిపెద్ద పొరపాటు. ఏదైనా ఆకస్మిక అనారోగ్యం సంభవిస్తే, హాస్పిటల్ బిల్లులు కట్టడానికి మనం కష్టపడి కొన్న ఆస్తులను అమ్మాల్సి వస్తుంది. బీమా అనేది ఆస్తులకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది.

ఒకేచోట పెట్టుబడి (Lack of Diversity):

డబ్బు మొత్తాన్ని కేవలం రియల్ ఎస్టేట్ లేదా బంగారంలోనే పెట్టడం రిస్క్. మార్కెట్ ఒడుదొడుకుల నుంచి తట్టుకోవాలంటే స్టాక్స్, బాండ్స్, బంగారం వంటి వివిధ రంగాల్లో పెట్టుబడులను విస్తరించాలి. దీనివల్ల ఒక రంగం దెబ్బతిన్నా, మరో రంగం సంపదను కాపాడుతుంది.

రహస్య అప్పులు:

మనకు ఉన్న అప్పులు లేదా ఆర్థిక లావాదేవీల గురించి కుటుంబ సభ్యులకు చెప్పకపోవడం పెద్ద తప్పు. మన తర్వాత ఆ రహస్య అప్పులు బయటపడితే, అవి పిల్లలకు తీరని భారంగా మారతాయి. అందుకే ఆర్థిక విషయాల్లో కుటుంబంతో పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం.

సంపాదన ఎంత అన్నది కాదు.. దానిని ఎంత క్రమశిక్షణతో నిర్వహించామన్నదే పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ చిన్న తప్పులను సరిదిద్దుకుంటేనే శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.

ఇది కూడా చదవండి: Constant fatigue causes | నిరంతర అలసటనా.. అదెంత ప్రమాదమంటే!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *