Chanakya Neeti Guidelines | ఈ నాలుగు చోట్ల పొరపాటున కూడా ఉండకండి.. లేదంటే కష్టాలు తప్పవు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Chanakya Neeti Guidelines | జీవితంలో ఎప్పుడు సాహసం చేయాలో.. ఎప్పుడు మౌనంగా వెనక్కి తగ్గాలో.. అనే విచక్షణే మనిషిని విజేతగా నిలబెడుతుంది. గొప్ప రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు తన ‘నీతి శాస్త్రం’లో లోక హితం కోసం ఎన్నో అమూల్యమైన సూచనలు చేశారు.

అందులో ముఖ్యంగా.. ప్రాణాపాయం లేదా పరువుకు భంగం కలిగే కొన్ని సందర్భాల్లో అక్కడి నుంచి తప్పుకోవడమే బుద్ధిమంతుడి లక్షణమని ఆయన హెచ్చరించారు. ఆ ప్రత్యేక పరిస్థితులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.akshara 1 2

Chanakya Neeti Guidelines | నేరస్థుల సావాసం వద్దు:

చాణక్యుడి ప్రకారం, ఎవరైనా నేరస్థుడు లేదా సమాజం అసహ్యించుకునే వ్యక్తి మన వద్దకు సహాయం కోసం వస్తే, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. అటువంటి వారికి సాయం చేయాలనే మంచితనం ఒక్కోసారి ముప్పు తెచ్చిపెట్టవచ్చు. వారి నేరాల్లో భాగస్వామ్యం ఉందనే ముద్ర పడే ప్రమాదం ఉంది. ఇది పరువుకు భంగం కలిగిస్తుంది.

Chanakya Neeti Guidelines | శత్రువు దాడి చేసినప్పుడు..

శత్రువు మీపై అకస్మాత్తుగా దాడికి దిగినప్పుడు లేదా మీకంటే బలమైన శత్రువు ఎదురైనప్పుడు ఆవేశంతో పోరాడటం కంటే.. తాత్కాలికంగా ఆ ప్రదేశం నుంచి తప్పుకోవడం ఉత్తమమని చాణక్య నీతి చెబుతుంది. దీనిని పిరికితనం అనుకోకూడదు. సరైన వ్యూహంతో, బలమైన ప్రణాళికతో తిరిగి శత్రువును దెబ్బకొట్టడానికి ఇది ఒక అవకాశం మాత్రమే. ఆయుధం కంటే ఆలోచనతోనే విజయం సాధ్యమని గుర్తుంచుకోవాలి.akshara today .jpg1

Chanakya Neeti Guidelines | హింస, అల్లర్లు జరిగే చోట..

ఎక్కడైనా హింస లేదా అల్లర్లు చెలరేగుతున్నప్పుడు అక్కడ ఉండటం ఏమాత్రం క్షేమం కాదు. ఉద్రిక్త పరిస్థితుల్లో జనం గుంపులుగా ఉన్నప్పుడు విచక్షణ కోల్పోతారు. అటువంటి సమయంలో మనం ఏ తప్పు చేయకపోయినా.. ఆ గందరగోళంలో చిక్కుకుని ప్రాణనష్టం లేదా గాయాల పాలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అల్లర్లు జరుగుతున్న ప్రదేశం నుంచి సైడ్ అవ్వడమే తెలివైన పని.

ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు..

తీవ్రమైన ఆర్థిక సంక్షోభం లేదా కరవు ఏర్పడిన చోట ఎక్కువ కాలం ఉండలేమని చాణక్యుడు హెచ్చరించారు. ఎక్కడైతే ఆహారం, నీరు కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందో, అక్కడ నివసించడం వల్ల పురోగతి ఉండదు. అటువంటి సమయంలో ముందు జాగ్రత్త పడటం లేదా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సంక్షోభ సమయాల్లో వనరుల కొరత మనిషి మనుగడను కష్టతరం చేస్తుంది.

ఇది కూడా చదవండి: Constant fatigue causes | నిరంతర అలసటనా.. అదెంత ప్రమాదమంటే!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *