Bigg Boss Telugu 10 | బిగ్‌బాస్ తెలుగు 10 హార్డింగ్ లీక్.. ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించిన ఓ హార్డింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Bigg Boss Telugu 10 | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10కి సంబంధించిన ఓ హార్డింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డుపై ప్రత్యక్షమైన ఆ హార్డింగ్ కొద్దిసేపట్లోనే మాయం కావడం రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అయితే, అది తొలగించే లోపే కొందరు అభిమానులు దానిని ఫోటోలు తీయడంతో అసలు విషయం బయటపడింది.

Bigg Boss Telugu 10 | మాయమైన హార్డింగ్..

ఆ హార్డింగ్‌పై “వీక్స్ అవతార్” (Week’s Avataar), అలాగే “పరీక్ష” అనే పదాలు స్పష్టంగా కనిపించాయి. దీంతో నెటిజన్లు ఫుల్ డిటెక్టివ్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. “బిగ్‌బాస్ పేపర్ లీక్ అయిందా?”, “హార్డింగ్ పోయింది.. క్లూ మిగిలిపోయింది!” అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, కామెంట్లతో జోరుగా చర్చ నడుస్తోంది.

Bigg Boss Telugu 10 | రకరకాల ఊహాగానాలు..

ఈ సీజన్ 10 థీమ్ ‘దశావతారం’ కావడం, పదింతల సర్ప్రైజ్‌లు, డ్రామా, ఛాలెంజ్‌లు ఉంటాయని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో “పరీక్ష” అనే పదం కంటెస్టెంట్లకు ఎదురుకాబోయే కొత్త టెస్ట్‌ను సూచిస్తుందా? లేదా ప్రతివారం హౌస్ కొత్త రూపం మారుతుందనే దానికి “వీక్స్ అవతార్” నిదర్శనమా? అనే కోణంలో అభిమానులు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్‌గా వస్తున్న ఈ షోలో ఇది అనుకోకుండా జరిగిన లీకా? లేక పబ్లిసిటీ స్టెప్సా? అనేది ఆసక్తికరంగా మారింది.

హార్డింగ్ తీసేయొచ్చు కానీ.. ఫ్యాన్ థియరీలను ఆపలేరు కదా!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 6వ తేదీ రాత్రి 7 గంటలకు స్టార్ మా , జియో హాట్‌స్టార్‌లో ( JioHotstar ) ఘనంగా ప్రారంభం కానుంది.

ఇది కూడా చదవండి:  BLA Attacks | పాక్ సైన్యంపై బీఎల్ఏ దాడులు.. 25 మంది జవాన్ల హతం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *