అక్షరటుడే, వెబ్డెస్క్ : Chanakya Niti | ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలు మనిషి జీవితానికి ఎల్లప్పుడూ ఒక మార్గదర్శకంలా నిలుస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఆయన బోధనలను తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. సమాజంలో ఎవరిని నమ్మాలో, ఎలాంటివారికి దూరంగా ఉండాలో ఆయన స్పష్టంగా చెప్పారు. మన చుట్టూ తిరుగుతూ మనకే హాని తలపెట్టే ప్రమాదకరమైన వ్యక్తులు ఎలాంటివారో చాణక్య నీతి ద్వారా తెలుసుకుందాం.
Chanakya Niti | తీపి మాటల మాయగాళ్లు
కొందరి మాటలు ఎంతో వినసొంపుగా, తియ్యగా ఉంటాయి.. కానీ వారి మనసులో మాత్రం కపటం, విషం నిండి ఉంటాయి. ఇలాంటి వారిని ముందే గుర్తించి చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం తమ అవసరాల కోసం మాత్రమే దగ్గరయ్యే ఇలాంటి వారు అసలు నిజమైన స్నేహితులు కారు. వీరు తగిన సమయం చూసి మన రహస్యాలను బయటపెట్టడంతో పాటు, లేనిపోని నిందలు కూడా మోపుతారు.
Chanakya Niti | నమ్మకద్రోహులు
ఎల్లప్పుడూ మన ఎదుగుదలను చూసి ఓర్వలేని వారికి, అసూయపడే వారికి దూరంగా ఉండాలి. ఒకసారి నమ్మకద్రోహం చేసిన వారికి రెండోసారి అవకాశం ఇవ్వకూడదు. వీరు తమ తప్పులను ఎప్పటికీ అంగీకరించకపోగా, తిరిగి మనల్నే నిందిస్తారు. అలాగే మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా మాట్లాడే ద్విముఖ స్వభావం గలవారు కూడా అత్యంత ప్రమాదకారులే.
Chanakya Niti | బలహీనతలను ఆసరాగా చేసుకునేవారు
మీ బలహీనతలు ఏమిటో తెలుసుకుని, సరైన సమయంలో మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూసే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదు. ఇలాంటి వారికి కూడా చాలా దూరంగా ఉండాలి. చాణక్య నీతి ప్రకారం.. చెడ్డ ప్రవర్తన కలిగిన వారితో మాట్లాడేకంటే, ఒంటరిగా ఉండటమే ఎంతో బెటర్ అని చాణక్య నీతి చెబుతుంది.
దీనిని కూడా చదవండి : Kamareddy Municipal Meeting | బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం.. మున్సిపల్ సమావేశంలో రసాభాస