జాతీయంOperation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని భారత ఆర్మీ తెలిపింది. ఆపరేషన్​ సిందూర్​కు ఏడాది అవుతున్న సందర్భంగా త్రివిధ దళాల అధిపతులు మీడియాతో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది అవుతున్న సందర్భంగా భారత ఆర్మీ అధికారులు మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల మీదుగా జరిగే రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందించడంలో ఇది ఒక శాశ్వత నమూనాను నెలకొల్పిందని పేర్కొన్నారు.

జైపూర్‌ (Jaipur)లో జరిగిన త్రివిధ దళాల సంయుక్త మీడియా సమావేశంలో, డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి మాట్లాడుతూ.. దుస్సాహసాలకు సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టం అన్నారు. ఉగ్రవాద చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడుల సమయంలో డైరెక్టర్ జనరల్ (డీజీ) ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్‌గా పనిచేసిన ఎయిర్ మార్షల్ భారతితో పాటు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్), వైస్ అడ్మిరల్ ఎ.ఎన్. ప్రమోద్ (డీజీ నేవల్ ఆపరేషన్స్), లెఫ్టినెంట్ జనరల్ జుబిన్ మిన్వాలా (డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్) కూడా పాల్గొన్నారు.

Operation Sindoor | దళాలకు పూర్తి స్వేచ్ఛ

గతేడాది పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. అనంతరం భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టి పాక్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​ (POK)లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ.. లక్ష్యం స్పష్టంగా ఉంది, దళాలకు పూర్తి కార్యాచరణ స్వేచ్ఛ ఇవ్వబడిందన్నారు. ఉగ్రవాదులు, వారి సహాయక మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు. ఇప్పుడు పాక్​లో ఏ ఉగ్రవాద స్థావరం సురక్షితం కాదని పేర్కొన్నారు. “మేము మా లక్ష్యాలను సాధించాం, మా మిషన్ పూర్తయింది. కానీ పాకిస్తానీ పాలకవర్గం ఉగ్రవాదానికి వత్తాసు పలికి, దానిని తమ పోరాటంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, అదే రీతిలో ప్రతిస్పందించడం తప్ప మాకు మరో మార్గం లేదు. ఇది కేవలం ఉగ్రవాద నిరోధక చర్యకు మించిన ఆత్మరక్షణ చర్య,” అని ఆయన అన్నారు.

Operation Sindoor | పోరాటం కొనసాగుతోంది

ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారతదేశ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారత్​ తన సార్వభౌమత్వాన్ని, భద్రతను, ప్రజలను నిశ్చయంగా, వృత్తిపరంగా, అత్యంత బాధ్యతతో కాపాడుకుంటుందని పేర్కొన్నారు. ఆపరేషన్​ సిందూర్​లో ఉపయోగించిన ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి, రాకెట్లు, క్షిపణులు, సెన్సార్లలో ఎక్కువ శాతం దేశంలోనే అభివృద్ధి అయినట్లు లెఫ్టినెంట్ జనరల్ ఘాయ్ చెప్పారు.

దీనిని కూడా చదవండి : Jailer Love Story | ఖైదీతో జైలర్ ప్రేమాయణం.. పెళ్లి పీటలెక్కిన అరుదైన ప్రేమకథ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Bakrid Peace Meeting | బక్రీద్​ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి..: సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, బోధన్​: Bakrid Peace Meeting | బక్రీద్ పండుగను (Bakrid...

Indiramma Housing Scheme | భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం.. వారికి కూడా ఇళ్లు! : మంత్రి పొంగులేటి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Housing Scheme | రాష్ట్రంలో భూ...

Telangana Rains | అకాల వర్షానికి తడిసిన ధాన్యం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rains | తెలంగాణలో అకాల వర్షం...

Disaster Mock Drill | విపత్తుల సన్నద్ధతపై మాక్ ఎక్సర్‌సైజ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Disaster Mock Drill | ప్రకృతి విపత్తులు...