నిజామాబాద్Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో గురువారం జాబ్ మేళాను వారు ప్రారంభించారు.

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy), కలెక్టర్​ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. జిల్లా యువజన క్రీడాశాఖ (Youth and Sports) ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను వారు ప్రారంభించారు.

Mega Job Mela | ఉమ్మడి జిల్లా నుంచి..

ఉమ్మడి జిల్లా నుండి పెద్ద సంఖ్యలో యువత జాబ్​మేళాకు తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలలో ఉద్యోగాల కోసం ఎంపికైన వారికి కలెక్టర్ రూరల్ ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. సుమారు రెండు వేల మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, మరికొందరికి అప్రెంటిస్ షిప్ ద్వారా శిక్షణ కోసం ఎంపిక చేశారన్నారు. ఈ తరహా అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ (Nizamabad Market Committee) ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్​వో పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఎన్ఐసీ అధికారి మధు, ఈ-డీఎం కార్తీక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

67667

ఇది కూడా చదవండి: Middle East | మధ్యప్రాచ్యంలో రణభేరి.. ఫుజైరా దాడితో మారిన ఇరాన్ – అమెరికా యుద్ధ గమనం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Yellareddy Road Accident | ఎల్లారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Kodandaram TJS Meeting | ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kodandaram TJS Meeting| గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే...

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది...

Middle East | మధ్యప్రాచ్యంలో రణభేరి.. ఫుజైరా దాడితో మారిన ఇరాన్ – అమెరికా యుద్ధ గమనం..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Middle East | మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు...