జాతీయంCloudflare Layoffs | ఏఐ ప్రభావం.. 1,100 మంది ఉద్యోగుల‌ని తొలగిస్తున్న క్లౌడ్‌ఫ్లేర్!

Cloudflare Layoffs | ఏఐ ప్రభావం.. 1,100 మంది ఉద్యోగుల‌ని తొలగిస్తున్న క్లౌడ్‌ఫ్లేర్!

భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందుకు అనుగుణంగా తమ సంస్థను మార్చుకునేందుకు ప్రముఖ సైబర్ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cloudflare Layoffs | ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ప్రభావం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సైబర్ భద్రతా సంస్థ క్లౌడ్‌ఫ్లేర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థలో పనిచేస్తున్న 1,100 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతానికి సమానమని సమాచారం.గురువారం కంపెనీ తన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించిన అనంతరం ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయం ఖర్చులు తగ్గించుకోవడం కోసం తీసుకున్నది కాదని, భవిష్యత్తులో ఏఐ ఆధారిత ప్రపంచానికి అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరించేందుకు చేపడుతున్న మార్పులలో భాగమని క్లౌడ్‌ఫ్లేర్ యాజమాన్యం వెల్లడించింది.

Cloudflare Layoffs | భ‌విష్య‌త్‌లో ఉండ‌వు..

సంస్థ సహ వ్యవస్థాపకులు మాథ్యూ ప్రిన్స్, మిషెల్ జాట్లిన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత సందేశంలో కీలక విషయాలు వెల్లడించారు. గత మూడు నెలల్లోనే కంపెనీలో ఏఐ వినియోగం 600 శాతానికి పైగా పెరిగిందని తెలిపారు. ఇంజినీరింగ్, మానవ వనరులు, ఆర్థిక విభాగాలు సహా దాదాపు అన్ని విభాగాల్లో వేల సంఖ్యలో ఏఐ ఆధారిత కార్యకలాపాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. “ఏజెంటెక్ ఏఐ” యుగానికి సిద్ధమవ్వాలంటే సంస్థ నిర్మాణంలో పెద్ద మార్పులు అవసరమని వారు వివరించారు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయి సాంకేతిక సంస్థలు ఎలా పనిచేస్తాయో నిర్వచించే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Cloudflare Layoffs | ఉద్యోగాలు కోల్పోయిన వారికి

అయితే ఉద్యోగుల్లో భయం, అనిశ్చితి నెలకొనకుండా ఒకేసారి ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ పేర్కొంది. తరచూ చిన్న చిన్న కోతలు విధించడం కంటే ఒకేసారి స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం మంచిదని యాజమాన్యం భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చేపట్టిన ఈ తొలగింపుల ప్రక్రియ ఒక్కసారికే పరిమితమని, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఉద్యోగ కోతలు ఉండవని కంపెనీ హామీ ఇచ్చింది. ఉద్యోగాలు కోల్పోయిన వారికి పరిశ్రమలోనే అత్యుత్తమ పరిహార ప్యాకేజీ అందిస్తున్నట్లు క్లౌడ్‌ఫ్లేర్ వెల్లడించింది. ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ప్రభావం పెరుగుతున్న కొద్దీ అనేక సాంకేతిక సంస్థలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్లౌడ్‌ఫ్లేర్ తీసుకున్న నిర్ణయం సాంకేతిక రంగంలో మరింత చర్చకు దారితీస్తోంది.

ఇది కూడా చదవండి..: Nida Khan Arrest | ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన TCS వంచకి నిదా ఖాన్

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...