తెలంగాణModel School Merit List | తెలంగాణ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష 2026 మెరిట్...

Model School Merit List | తెలంగాణ మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష 2026 మెరిట్ జాబితా విడుదల

తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్​లో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మెరిట్ జాబితాను అధికారులు విడుదల చేశారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Model School Merit List | తెలంగాణ మోడల్ స్కూళ్లలో (Telanagana model school) 2026 విద్యా సంవత్సరానికి గాను 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్​లో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం మెరిట్ జాబితాను(entrance exam results) అధికారులు విడుదల చేశారు.

Model School Merit List | రాష్ట్రవ్యాప్తంగా..

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్ స్కూళ్లలో(TGMS results) 6వ తరగతితో పాటు 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి గతనెలలో ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ జరిగింది. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థుల మెరిట్ జాబితాను జిల్లాల వారీగా, పాఠశాలల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ http://tgms.telangana.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. సంబంధిత మండల విద్యాధికారి (DEO Kamareddy) కార్యాలయంలో సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు కోరారు.

Model School Merit List | సర్టిఫికెట్లతో వెరిఫికేషన్​కు..

మెరిట్ జాబితాలో ఎంపికైన విద్యార్థులు నిర్ణీత తేదీల్లో సంబంధిత మోడల్ స్కూళ్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. కుల,ఆదాయ, నివాస, బదిలీ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని తెలిపారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తుది అడ్మిషన్ జాబితాను ప్రకటిస్తారు. సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు కోరారు.

ఇది కూడా చదవండి: Gold Rates Today | రికార్డు స్థాయికి బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ షాక్!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 09 Gold Prices | గోల్డ్ లవర్స్‌కు ఊరట.. రెండు రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Gold Prices | దేశీయ మార్కెట్‌లో బంగారం...

CDS Raja Subramani | చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: CDS Raja Subramani | కీలక సైనిక నియామకాన్ని...

May 09 Horoscope | గృహ సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్‌.. భవిష్యత్తులో జాక్‌పాట్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 09 Horoscope | గ్రహాల గమనంలో కనిపిస్తున్న...

Cisco Abhilash Reddy Package | రూ. 2 కోట్ల వార్షిక వేతనం సాధించిన తెలంగాణ తేజం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Cisco Abhilash Reddy Package | పాలమూరు జిల్లా అడ్డాకుల...