అక్షరటుడే వెబ్డెస్క్:Bengal CM Race| పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అనూహ్య ఫలితాలతో అధికారం దిశగా అడుగులు వేసిన బీజేపీ, ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనే అంశంపై కసరత్తు మొదలుపెట్టింది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో భేటీ కావడానికి కేంద్ర హోంమంత్రి, ఎన్నికల పరిశీలకుడు అమిత్ షా కోల్కతా చేరుకోవడంతో బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Bengal CM Race|కోల్కతాలో అమిత్ షా భేటీ..
కాసేపటి క్రితమే కోల్కతా చేరుకున్న అమిత్ షా, బీజేపీ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలోనే బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిందని, కేవలం ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ప్రకటన చేయడం మాత్రమే మిగిలిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Bengal CM Race|సీఎం రేసులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా..
ముఖ్యమంత్రి పీఠం కోసం వినిపిస్తున్న పేర్లలో సువేందు అధికారి పేరు అందరికంటే ముందు వరుసలో ఉంది. నందిగ్రామ్, భవానీపూర్ స్థానాల్లో మమతా బెనర్జీపై విజయం సాధించి ‘జైంట్ కిల్లర్’గా పేరు తెచ్చుకున్న సువేందుకే హైకమాండ్ మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అధిష్టానం భావిస్తోంది.
Bengal CM Race|పోటీలో సీనియర్ నేతలు..
కేవలం సువేందు మాత్రమే కాకుండా, బీజేపీ రాష్ట్ర సీనియర్ నేతలు దిలీప్ ఘోష్, సమిక్ భట్టాచార్య, అగ్నిమిత్ర పాల్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటారా లేక సువేందు లాంటి మాస్ లీడర్కు అవకాశం ఇస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అమిత్ షా సమక్షంలో జరిగే ఈ భేటీ తర్వాత బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిపై పూర్తి స్పష్టత రానుంది.
ఇది కూడా చదవండి: Chicken Price Hike | మాంసం ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

