జాతీయంVijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

Vijay Tamil Nadu|మేజిక్ ఫిగర్ దాటేసిన టీవీకే.. సీఎం పీఠం దిశగా దళపతి!

తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు కోసం సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, వీసీకే అధినేత తిరుమావళవన్ శనివారం విజయ్‌కు తన మద్దతును ప్రకటించారు.

అక్షరటుడే వెబ్‌డెస్క్:Vijay Tamil Nadu|తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలవబోతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కు కోసం సాగుతున్న ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, వీసీకే అధినేత తిరుమావళవన్ శనివారం విజయ్‌కు తన మద్దతును ప్రకటించారు. ఈ మేరకు మద్దతు లేఖను కూడా అందజేశారు. ఇప్పటికే కాంగ్రెస్ , వామపక్ష పార్టీల మద్దతు పొందిన టీవీకే, ఇప్పుడు వీసీకే తోడవడంతో స్పష్టమైన మెజారిటీని (118 స్థానాలు) సొంతం చేసుకుంది.

Vijay Tamil Nadu|నాలుగోసారి గవర్నర్‌తో భేటీ..

అవసరమైన బలం సమకూరడంతో, విజయ్ నేడు లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలవనున్నారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేల జాబితాను సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరనున్నారు. గత మూడు రోజులుగా గవర్నర్ మెజారిటీపై ఆంక్షలు విధించడంతో ఈ ప్రక్రియ జాప్యం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సంఖ్యాబలం ఖచ్చితంగా ఉండటంతో గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

Vijay Tamil Nadu|ముగియనున్న అసెంబ్లీ గడువు..

ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 10వ తేదీతో ముగియనుంది. ఈ లోపే కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉండటంతో, చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే విజయ్ తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Vijay Tamil Nadu|రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌..

దశాబ్దాల కాలంగా డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీల చుట్టూ తిరుగుతున్న తమిళ రాజకీయాలు ఇప్పుడు ముక్కోణపు పోటీగా మారాయి. ఒక సినిమా స్టార్ నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం తమిళనాట ఇది మొదటిసారి కాకపోయినా, ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ సాధించిన ఈ విజయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా టీవీకే శ్రేణులు , విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Vijay TVK | విజయ్ సీఎం కావడంలో జాప్యం.. టీవీకే కార్యకర్త ఆత్మహత్యాయత్నం

Shivam nagarani
Shivam nagaranihttps://aksharatodaynews.com/
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.

Share post:

Popular

More like this
Related

Youth Congress Presidents | కష్టపడ్డ కార్యకర్తలకు దక్కిన ఫలితం.. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Youth Congress Presidents | కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని...

India MIRV Missile|ఒకే క్షిపణి.. ఎన్నో లక్ష్యాలు.. రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర.

అక్షరటుడే వెబ్‌డెస్క్:India MIRV Missile|భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. అణ్వస్త్ర...

TamilNadu Politics | సస్పెన్షన్​ థ్రిలర్​లా ట్విస్టులు.. ఎట్టకేలకు విజయ్‌కి గవర్నర్ అపాయింట్‌మెంట్‌

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TamilNadu Politics | తమిళ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి....

Anil Ambani CBI|అనిల్ అంబానీకి షాక్.. ఏడీఏ గ్రూప్ కంపెనీలపై సీబీఐ సోదాలు

అక్షరటుడే వెబ్‌డెస్క్:Anil Ambani CBI|ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ గ్రూప్ (ADAG)...