హైదరాబాద్MMTS Free Travel | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా...

MMTS Free Travel | హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఉచిత ప్రయాణం.. జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభం

ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని జూన్ 2 నుంచి ఏడాది పాటు అమలు చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: MMTS Free Travel | హైదరాబాద్ నగరవాసులకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) విప్లవాత్మక అడుగు వేసింది.

రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాయకత్వంలోని ప్రభుత్వం, నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణాన్ని అందించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేయనున్నారు. ఇప్పటికే సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికార యంత్రాంగం వేగంగా చర్యలు చేపడుతోంది.

MMTS Free Travel | రైల్వేతో కీలక చర్చలు

ఈ పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం, సౌత్ సెంట్ర‌ల్ రైల్వే (South Central Railway) అధికారులతో కీలక సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు సంవత్సరానికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం వస్తోంది. ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. కోవిడ్‌కు ముందు రోజుకు సుమారు 1.20 లక్షల మంది ప్రయాణించిన ఎంఎంటీఎస్‌లో ప్రస్తుతం ఆ సంఖ్య 40 వేలలోపుకు పడిపోయింది. ఫ్రీక్వెన్సీ తగ్గడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఉచిత ప్రయాణంతో పాటు సేవలను మెరుగుపరిస్తే మళ్లీ పూర్వ వైభవం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

MMTS Free Travel

MMTS Free Travel | స్టేషన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల

ప్రభుత్వం కేవలం ఉచిత ప్రయాణం (Free Travelling) మాత్రమే కాకుండా, సేవల్లో సమగ్ర మార్పులకు సిద్ధమవుతోంది.రద్దీ సమయాల్లో రైళ్ల సంఖ్య పెంపు, సమయపాలన కచ్చితంగా పాటించడం, స్టేషన్లలో మౌలిక సదుపాయాల మెరుగుదల, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణ, లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఫోకస్ చేస్తున్నారు. ప్ర‌యాణికులకు పూర్తి సౌలభ్యం కల్పించేందుకు స్టేషన్ల నుంచి నివాస ప్రాంతాలకు ఆర్టీసీ షటిల్ బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్టేషన్ల వద్ద బస్సులకు ప్రత్యేక స్థలం కేటాయించాలని రైల్వేను కోరింది.ఈ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. అయితే, రైళ్ల ఫ్రీక్వెన్సీ, టైమింగ్స్‌పై తుది నిర్ణయం రైల్వే శాఖదేనని స్పష్టం చేసింది. పథకం అమలుకు సంబంధించి ఎంవోయూ ముసాయిదా పంపాలని రాష్ట్రాన్ని కోరింది. అన్ని ప్రక్రియలు పూర్తి అయితే, జూన్ 2 నుంచి హైదరాబాద్ నగరవాసులకు ఎంఎంటీఎస్‌లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది.

ఇది కూడా చదవండి..: Modi on Women Reservation | మహిళల కలలను ధ్వంసం చేశారు.. విపక్షాలపై ప్రధాని ఫైర్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్ (Madhya...

SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థుల ప్రభంజనం

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: ​SR SSC Results ​| ఎస్సెస్సీ ఫలితాల్లో...

Sunrisers Batting | వాంఖడేలో పరుగుల వరద.. స‌న్‌రైజ‌ర్స్ తుపాను చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న నీతా అంబాని

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sunrisers Batting | ముంబైలోనివాంఖడే స్టేడియం వేదికగా జరిగిన...

Amaravati Development | అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయాలు.. ఈరోజు మంత్రివర్గ సమావేశంలో భారీ ప్రాజెక్టులకు ఆమోదం?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Amaravati Development | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి...