తెలంగాణHyderabad Vijayawada Road | హైదరాబాద్​–విజయవాడ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి...

Hyderabad Vijayawada Road | హైదరాబాద్​–విజయవాడ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి : మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్​–విజయవాడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కోరారు. ఎన్​హెచ్​ఏఐ ఛైర్మన్​ సంతోష్ కుమార్ యాదవ్​తో ఆయన భేటీ అయ్యారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad Vijayawada Road | నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్​–విజయవాడ రోడ్డు విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (Komatireddy Venkatreddy) కోరారు. నిత్యం ప్రమాదాలతో ఈ మార్గాన్ని డెత్​ రోడ్​గా పిలుస్తున్నారని పేర్కొన్నారు.

ఎన్​హెచ్​ఏఐ (NHAI) ఛైర్మన్​ సంతోష్ కుమార్ యాదవ్​తో మంత్రి కోమటిరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. రీజినల్ రింగ్ రోడ్డు (RRR), హైదరాబాద్ – విజయవాడ(NH-65) విస్తరణ పనులు ప్రారంభంపై చర్చించారు. ఇదే రహదారిలో ఎల్బీనగర్ (LB Nagar) నుంచి హయత్ నగర్ వరకు నాగపూర్ తరహాలో 7.1కి.మీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ మేరకు డీపీఆర్​ను పంపినట్లు గుర్తు చేశారు.

Hyderabad Vijayawada Road | త్వరలో ప్రారంభిస్తాం

హైదరాబాద్ – విజయవాడ, రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్​హెచ్​ఏఐ ఛైర్మన్​ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక భాగస్వామ్యంగా నిలిచే ప్రాజెక్టులు త్వరగా పూర్తయేలా చూడాలని మంత్రి ఆయనను కోరారు. రోడ్లు భవనాలు శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రత్యేక కార్యదర్శి ప్రావిణ్య, ఎన్​హెచ్​ఏఐ రీజినల్ ఆఫీసర్ శివ శంకర్, ఆర్అండ్​బీ సీఈలు ధర్మారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy | తెలంగాణపై పెద్ద మనసు చూపండి.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విన్నపం!

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Modi Targets Congress | ఈ సారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమే : ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Targets Congress | ఈ సారి...

Siddipet Couple Suicide|సిద్దిపేటలో విషాదం.. పెళ్లైన నెలకే నవ దంపతుల ఆత్మహత్య

అక్షరటుడే వెబ్‌డెస్క్:Siddipet Couple Suicide|ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ జంట నూరేళ్లు...

Nizamabad Rural Police | భార్యాభర్తల గలీజు దందా.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Rural Police | సులభంగా డబ్బు...

Vijay Resignation | పెరంబూర్ ఎమ్మెల్యేగానే విజయ్.. తిరుచ్చి ఈస్ట్ పదవికి రాజీనామా

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Resignation |తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే...