అక్షరటుడే, వెబ్‌డెస్క్: Prateek Yadav Death | సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav) చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ Prateek Yadav (38) బుధవారం తెల్లవారుజామున హఠాన్మరణం చెందారు. ఈ ఘటన యాదవ్ కుటుంబంతో పాటు ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం సుమారు 6:15 గంటల సమయంలో ప్రతీక్ యాదవ్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Prateek Yadav Death | మృతికి కారణాలు ఏంటి..
ప్రతీక్ యాదవ్ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ప్రాథమిక పరిశీలనలో ఆయన శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు కనిపించలేదని వైద్యులు తెలిపారు. మరణానికి అసలు కారణం తెలుసుకునేందుకు కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (King George’s Medical University) (KGMU) వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించనుంది. ఆ నివేదిక వెలువడిన తర్వాతే మరణానికి గల పూర్తి కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రతీక్ యాదవ్.. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సవతి సోదరుడు. అలాగే బీజేపీ నాయకురాలు అపర్ణ యాదవ్ Aparna Yadav భర్త. రాజకీయ కుటుంబంలో జన్మించినప్పటికీ, ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండేవారు. రియల్ ఎస్టేట్, ఫిట్‌నెస్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉండేది.
Prateek Yadav Death | శోకసంద్రంలో ప్రతీక్ యాదవ్ కుటుంబం
ప్రతీక్ యాదవ్ అకాల మరణంతో యాదవ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వివిధ రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలపై కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, ప్రతీక్ యాదవ్ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత ములాయం సింగ్ యాదవ్ రెండవ భార్య సాధనా గుప్తా కుమారుడు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, ఆయన ఒక ప్రముఖ వ్యాపారవేత్తగా, ఫిట్‌నెస్ నిపుణుడిగా గుర్తింపు పొందారు.
ఇది కూడా చదవండి..: Gold Duty Hike | పసిడిపై సుంకాల సెగ: ఆర్థిక సంక్షోభానికి సంకేతమా?

