జాతీయంCentral Cabinet Reshuffle | త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

Central Cabinet Reshuffle | త్వరలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ!

కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు సమాచారం. దీంతో పాటు కొత్త బీజేపీ జాతీయ బృందాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Central Cabinet Reshuffle | కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించనున్నట్లు సమాచారం. దీంతో పాటు కొత్త బీజేపీ జాతీయ బృందాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మే చివరి వారం లేదా జూన్‌ మొదటి వారంలో పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రధాని మోదీ (Prime Minister Modi) ఈ నెల 15 నుంచి 20 వరకు విదశీ పర్యటనకు వెళ్తారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మంత్రివర్గ పునర్​ వ్యవస్థీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. మోదీ మూడో సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి జూన్​ 9తో రెండేళ్లు పూర్తి కానుంది. ఈ క్రమంలో మంత్రివర్గంలో పలువురికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్నవారిలో కొందరిని తప్పించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.

Central Cabinet Reshuffle | తెలంగాణ నుంచి..

తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ నాయకులు మంత్రివర్గంలో స్థానం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.ఈటల రాజేందర్ (Eatala Rajender), అరవింద్ ధర్మపురి (Arvind Dharmapuri) ముందు వరుసలో ఉన్నారని చెబుతుండగా మిగతా వారు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యసభ నుంచి వచ్చిన డాక్టర్ లక్ష్మణ్ కూడా రేసులో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్నవారిలో ఒకరిని తప్పించే అవకాశం ఉంది.

Central Cabinet Reshuffle | బండి సంజయ్​పై వేటు!

కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు బీజేపీకి తలనొప్పిగా మారింది. దీనిపై కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నిరసన తెలుపుతున్నాయి. బండి సంజయ్​ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పిస్తారా అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో తెలంగాణకు ఊహించని పరిణామాలు ఎదురుకావచ్చు.

ఇది కూడా చదవండి..: Prateek Yadav Death | ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ హఠాన్మరణం.. రాజకీయ వర్గాల్లో విషాదం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Vijay Floor Test | బల పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Floor Test | తమిళనాడు (Tamil...

Srivani Tickets Scam | శ్రీవారి టికెట్ల హైజాక్.. సాఫ్ట్‌వేర్ వాడి అక్రమార్కుల దోపిడీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Srivani Tickets Scam |తిరుమల శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌లో...

NEET Paper Leak | రూ.30 లక్షలకు నీట్​ పేపర్​ కొనుగోలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: NEET Paper Leak | నీట్​ పేపర్​ లీకేజీ...

Stock Market Today | ఒడిదుడుకుల్లో మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్: cStock Market Today | దేశీయ స్టాక్ మార్కెట్...